DSC 2024 Teachers Allotment: కొత్త టీచర్లకుపాఠశాలల కేటాయింపు
Sakshi Education
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ–2024లో నియామకమైన కొత్త ఉపాధ్యాయులకు పాఠశాలలను కేటాయించారు.
అక్టోబర్ 15న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్‌లు ఇచ్చే ప్రక్రియ రాత్రి 9.30గంటల వరకు కొనసాగింది. కాగా ప్రక్రియ ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుందని మొదట అధికారులు ప్రకటించినా.. సాంకేతిక సమస్యల వల్ల ప్రక్రియ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించారు.
చదవండి: School Teachers : ఖాళీగా 2,800 పోస్టులు.. బెడిసికొట్టిన సర్దుబాటు..!
మొత్తం 196 మంది కొత్త ఉపాధ్యాయులకు పాఠశాలలకు కేటాయించి.. అందుకు సంబంధించి నియామక పత్రాలను అధికారులు అందించారు. ఆర్డర్లు తీసుకున్న ఉపాధ్యాయులు అక్టోబర్ 16 మధ్యాహ్నం లోగా విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు. కాగా.. రాత్రి వరకు కౌన్సెలింగ్ జరగడంతో మహిళా అభ్యర్థులతో పాటు గర్భణీలు కాస్త ఇబ్బంది పడ్డారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 16 Oct 2024 03:52PM