DSC 2024 Teachers Appointment: కొత్త టీచర్ల కేటాయింపు ఇలా...
అక్టోబర్ 9న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో నియామ క పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. డీఎస్సీ అభ్యర్థులు అక్టోబర్ 15న ఉదయం 10గంటలకు విద్యాశాఖ కార్యాలయంలో హాజరు కావాలని.. అక్కడికి వచ్చిన వారికి ఆదేశాలు రాలేదంటూ మధ్యాహ్నం మళ్లీ రావాలని అధికారులు సూచించడంతో గందరగోళం ఏర్పడింది. గంటకోమాట చెప్పడంతో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
చివరికి కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత పాఠశాలల వారీగా ఖాళీల ను గుర్తించి అభ్యర్థులకు తెలిసేలా ఇంటర్నెట్‌లో ఉంచారు. 288 ఉపాధ్యాయుల పోస్టులకు గాను 248మంది అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా.. అందులో 230మందికి మాత్రమే పాఠశాలల కేటాయింపు అవకాశం దక్కింది. మరో 18పోస్టులకు సంబంధించి ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ప్రక్రి య నిర్వహించలేదు.
చదవండి: DSC 2024: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయా?
కేటాయింపు ఇలా...
జాబితాలో ప్రదర్శించిన ఖాళీల్లో అనువైన పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ సాగింది. టీచర్లు లేని పాఠశాల(సర్దుబాటు టీచర్లు కొనసాగుతున్న)కు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కేటాయించారు.
పాఠశాలల్లో సబ్జెక్టు కొరత లేకుండా ప్రాధాన్యత ఇచ్చా రు. పట్టణ ప్రాంతంలో ముగ్గురు టీచర్లకు ఇద్దరు టీచర్లు ఉండి పోస్టు ఖాళీగా ఉన్నా అసలే లేని మారుమూల ప్రాంతాల పాఠశాలలకు ప్రాధాన్యం కల్పించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
230 మంది..
మొత్తం 248 పోస్టులకు గాను 230మంది ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు61, ఎస్జీటీలు 169 మందికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. 18 మంది ఈడబ్ల్యూఎస్, ప్రత్యేక అవసరాల టీచర్ల పోస్టుల(స్పెషల్ ఎడ్యుకేషన్)కు ఎంపికలు, కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించలేదు.
ప్రస్తుత కౌన్సెలింగ్‌లో ఎస్జీటీ(తెలుగు) 149, ఉర్దూ 4, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 5, ఎస్‌ఏ సోషల్ 23, ఎస్‌ఏ ఫిజిక్స్ 1, ఎస్‌ఏ గణితం 9, ఎస్‌ఏ హిందీ 6, ఎస్‌ఏ ఇంగ్లిష్ 5, ఎస్‌ఏ బయోసైన్స్ 12, పీఈటీలు 3, ఎల్‌పీ 13 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించారు.
బదిలీ టీచర్లు రిలీవ్..
జిల్లాలో ఈ ఏడాది జూన్ చివరి వారంలో జరిగిన బదిలీ కౌన్సెలింగ్‌లో 575 మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు. రిలీవర్స్ లేకపోవడంతో ఉపాధ్యాయులకు బదిలీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో 50శాతం ఉపాధ్యాయులు పాత పాఠశాలల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు కొత్తగా టీచర్లు రా నుండడంతో ఎవరు రిలీవర్ వచ్చినా వారు అక్కడి నుంచి బదిలీ అయి కొత్త పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించామని, ఈ నెల 16న పాఠశాలల్లో చేరాలని డీఈవో యాదయ్య తెలిపారు.
భావితరాలను తీర్చిదిద్దాలి
మంచిర్యాల అగ్రికల్చర్: భావితరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవార కలెక్టరేట్‌లో డీఎస్సీలో అభ్యర్థుల పోస్టింగ్ కౌన్సెలింగ్‌కు డీఈవో ఎస్.యాదయ్యతో కలిసి హాజయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులతో మమేకమై వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తూ ఉత్తమ ఫలితాల సాధించాలని తెలిపారు.
Tags
- Department of Education
- new teachers
- ts dsc 2024
- Telangana Education Dept to Adjust Teacher Allotment
- School Assistants
- SGT
- Teachers
- DSC 2024 Teachers Appointment
- Mancherial District News
- Telangana News
- recruitment counseling of DSC-2024
- Mancherial Urban education
- school allotment process
- recruitment documentation
- job allotment process
- SakshiEducationUpdates