Free Coaching: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. 3 నెలల పాటు ఉచిత శిక్షణ..
Sakshi Education
ఆదిలాబాద్: యువజన సర్వీసుల శాఖ, సెట్వి న్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
జిల్లా కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అందించిన ఉచిత శిక్షణను పూర్తి చేసుకున్న వారికి నవంబర్ 22న సర్టిఫికెట్లు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద యువత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
చదవండి: Free Special training for women: డిజిటల్ టెక్నాలజీపై మహిళలకు ఉచిత శిక్షణ
మూడు నెలల పాటు 120 మంది యువత శిక్షణ పొందారని వెల్లడించారు. టైలరింగ్ నేర్చుకున్న వారు డ్వాక్రా గ్రూపులలో సభ్యులుగా చేరాలని సూచించారు. ఇందులో డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూవో సబిత, ప్రిన్సిపాల్ రవీందర్, వైటీసీ ఇన్‌చార్జి బలరాం, లలిత, సాగర్, విశాల్, సునీల్ తదితరులున్నారు.
Published date : 23 Nov 2024 12:38PM