Skip to main content

Free Special training for women: డిజిటల్‌ టెక్నాలజీపై మహిళలకు ఉచిత శిక్షణ

Digital technology Free training for womens
Digital technology Free training for womens

తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు, ఎన్‌జీఓలకు ఆధునిక సాంకేతిక, డిజిటల్‌ టెక్నాలజీపై మూడు రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వీసీ వీ.ఉమ తెలిపారు.

గ్రామీణ కరెంట్‌ ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు జీతం 45వేలు: Click Here

సోమవారం వర్సిటీలోని సావేరి సెమినార్‌ హాల్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా వర్సిటీ, యునైటెడ్‌ నేషన్‌న్స్‌ ఏషియన్‌ అండ్‌ పసిఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ ఫర్‌ డెవలప్మెంట్‌ (ఏపీసీఐసీటీ) సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్‌ నైపుణ్యాభివృద్ధిపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌
ప్రధానంగా వైఫై–డీఎక్స్‌, ఎంపవరింగ్‌ ఉమెన్‌ ఎంట్రపెన్యూర్స్‌ త్రూ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ అనే అంశంపై మహిళా వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ పేరుతో నిర్వహించే వైఫై డీఎక్స్‌ శిక్షణ ప్రపంచంలోని 18 దేశాలలో అమలు చేశారని తెలిపారు. యూఎన్‌, థాయిలాండ్‌, సింగపూర్‌, ఫిలిప్ఫీన్స్‌ వంటి దేశాల నుంచి నిపుణులైన ట్రైనర్స్‌ ఈ సదస్సుకు వస్తున్నారన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ రజిని, పీఆర్‌ఓ పాల్గొన్నారు.

Published date : 23 Oct 2024 02:58PM

Photo Stories