Skip to main content

TG DSC Counselling Postponed : బ్రేకింగ్ న్యూస్‌... డీఎస్సీ టీచర్‌ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా... ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ వ్యాప్తంగా నేడు జరగాల్సిన డీఎస్సీ-2024 ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని టీఎస్ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
Telangana DSC Counselling Postponed

సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన సంగతిత తెలిసిందే.

➤☛ TGPSC Group 3 Exam Time Table : బ్రేకింగ్ న్యూస్‌.. గ్రూప్‌-3 ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. ఒకొక్క‌ పోస్ట్‌కు ఎంత మంది పోటీ అంటే...?

నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే డాటా ఇంకా రానందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ తెలిపింది. రేపు(బుధవారం) కౌన్సిలింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

☛➤ TG DSC Rankers Success Stories : విచిత్రంగా రిటైర్మెంట్ రోజే... కొడుకు, కోడ‌లు ఒకేసారి ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ...

Published date : 15 Oct 2024 03:51PM

Photo Stories