Skip to main content

DSC 2024 District wise Selection List: కొత్త టీచర్లకు నియామక పత్రాలు.. జిల్లాల వారీగా ఎంపికైన టీచర్ల జాబితా ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు 10 వేల మంది వరకూ రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా చేరబోతున్నారు.
Chief Minister A. Revanth Reddy handing appointment orders to new teachers at LB Stadium  TG DSC 2024 District wise final Selection List  Chief Minister A. Revanth Reddy presenting appointment orders

ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీరికి అక్టోబర్ 8న‌ నియామక ఉత్తర్వులు నేరుగా అందించనున్నారు. హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎంపికైన కొత్త టీచర్లకు సంబంధిత జిల్లా కేంద్రాల డీఈవోల నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. 

ఉదయం డీఈవో ఆఫీసుకు రావాలని కోరారు. జిల్లాల నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఇతర టీచర్లు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 

ఈ పరీక్షకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ నిర్వహించారు. సెపె్టంబర్‌ 30న డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేశారు. ప్రతి పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, జిల్లా సెలక్షన్‌ కమిటీకి పంపారు. వారం రోజుల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ముగ్గురిలో ఒకరిని జిల్లా సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వీరికి నియామక పత్రాలను అందించబోతున్నారు.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

10,006 పోస్టుల భర్తీ.. 

మొత్తం 11,062 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం 10,006 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. మిగతా పోస్టుల్లో కొన్ని బ్యాక్‌లాగ్‌లపై నిర్ణయం తీసుకోలేదు. కొన్ని న్యాయపరమైన వివాదాల వల్ల ఆగిపోయాయి. కొన్ని పోస్టులకు సరైన అభ్యర్థి దొరకలేదని అధికారులు తెలిపారు. 

ఎస్‌జీటీ, ఎస్‌ఏ రెండు ఉద్యోగాలు వచ్చిన వాళ్లు 700 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి, ఏదైనా ఒకదానిలో కొనసాగేందుకు ఐచ్ఛికం ఇచ్చారు. ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారికి టీచర్‌ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశారు.   

జిల్లాల వారీగా ఎంపికైన టీచర్ల జాబితా ఇదే..

ఆదిలాబాద్ - క్లిక్ చేయండి

భద్రాద్రి కొత్తగూడెం - క్లిక్ చేయండి

హన్మకొండ - క్లిక్ చేయండి

హైదరాబాద్ - క్లిక్ చేయండి

జగిత్యాల్ - క్లిక్ చేయండి

జనగాం - క్లిక్ చేయండి

జయశంకర్ భూపాలపల్లి - క్లిక్ చేయండి

జోగులాంబ గద్వాల్ - క్లిక్ చేయండి

కామారెడ్డి - క్లిక్ చేయండి

కరీంనగర్ - క్లిక్ చేయండి

ఖమ్మం - క్లిక్ చేయండి

కుమురం భీమ్ ఆసిఫాబాద్ - క్లిక్ చేయండి

మహబూబాబాద్ - క్లిక్ చేయండి

మహబూబ్ నగర్ - క్లిక్ చేయండి

మంచిర్యాల - క్లిక్ చేయండి

మెదక్ - క్లిక్ చేయండి

మేడ్చల్-మల్కాజిగిరి - క్లిక్ చేయండి

ములుగు - క్లిక్ చేయండి

నాగర్‌కర్నూల్ - క్లిక్ చేయండి

నల్గొండ - క్లిక్ చేయండి

నారాయణపేట - క్లిక్ చేయండి

నిర్మల్ - క్లిక్ చేయండి

నిజామాబాద్ - క్లిక్ చేయండి

పెద్దపల్లి - క్లిక్ చేయండి

రాజన్న సిరిసిల్ల - క్లిక్ చేయండి

రంగా రెడ్డి - క్లిక్ చేయండి

సంగారెడ్డి - క్లిక్ చేయండి

సిద్దిపేట - క్లిక్ చేయండి

సూర్యాపేట - క్లిక్ చేయండి

వికారాబాద్ - క్లిక్ చేయండి

వనపర్తి - క్లిక్ చేయండి

వరంగల్ - క్లిక్ చేయండి

యాదాద్రి భువనగిరి - క్లిక్ చేయండి

Published date : 09 Oct 2024 02:39PM

Photo Stories