TG Teacher Appointment Letter : సీఎం చేతులమీదుగా.. రేపే డీఎస్సీకి ఎంపికైన వారికి అపాంయింట్‌మెంట్ లెటర్స్
Sakshi Education
తెలంగాణ డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు(బుధవారం)హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
TG Teacher Appointment Letter
అక్టోబర్ 9న ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేయన్నునారు. ఈ నేపథ్యంలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ఉదయం 7గంటలలోగా హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వారి పాస్‌పోర్ట్ ఫోట్రాగ్రాఫ్‌ను అందజేసిన తర్వాత సమావేశానికి సంబంధించి ఒక ఐడీ కార్డును అందిస్తారు.
కాబట్టి ఎంపికైన అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ ఫోటోను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎంపికైన వారిలో పాలిచ్చే తల్లులు, గర్భిణులు, దివ్యాంగులు ఉంటే వారి వెంట ఒకరిని వెంట తెచ్చుకోవడానికి వీలు కల్పించారు.
IT Jobs Opportunities in Tech Mahindra IT Jobs Opportunities in Tech Mahindra Apply for IT jobs at Tech Mahindra Tech Mahindra latest IT job openings 2025