Skip to main content

Women Employment : మ‌హిళ‌ల‌కు ఉపాధి ప‌థ‌కం.. ప‌ది పాసైతే చాలు.. నెల‌వారీ స్టైఫండ్‌గా..

బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది.
LIC employment offer for women with insurance sakhi yojana scheme  Prime Minister Narendra Modi launching LIC Bima Sakhi Yojana in Panipat, Haryana

సాక్షి ఎడ్యుకేష‌న్: డిసెంబర్ 9న హరియాణాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 'ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన' పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. 

ప్రాథ‌మిక ల‌క్ష్యం: మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం.

CSL Job Recruitment: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

కీలక అంశాలు..

అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.

శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.

Job Mela: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000. రెండో సంవత్సరంలో రూ.6,000. మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.
బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 10 Dec 2024 10:07AM

Photo Stories