Skip to main content

TS DSC 2024 Postpone Updates : డీఎస్సీ-2024 పరీక్షలను నిలిపివేయాలని పిటిషన్‌.. ఈ విచారణను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో డీఎస్సీ –2024 పరీక్షలు జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రెండు సెషన్లలో జ‌ర‌గ‌నున్న విష‌యం తెల్సిందే.
ts high court

అయితే.. ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల‌ను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. 

➤☛ TS DSC Exam Day 2024 Tips : డీఎస్సీ-2024 ప‌రీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు Exam Day Last Minute Tips ఇవే..!

అభ్యర్థులు చదువుకోవడానికి సరైన సమయం కూడా..
ప్ర‌భుత్వ టీచ‌ర్‌ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పుల్లా కార్తిక్‌ విచారణ చేపట్టారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సిలబస్‌ ఎంతో క్లిష్టంగా ఉందని, అభ్యర్థులు చదువుకోవడానికి సరైన సమయం కూడా ఇవ్వలేదని, ఇది విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. 

Again DSC 2024 Notification Details : గుడ్‌న్యూస్‌.. మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్‌.. ఎప్పుడంటే..?

పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ..
ఈ డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.

Published date : 18 Jul 2024 07:11PM

Photo Stories