Skip to main content

Again DSC 2024 Notification Details : గుడ్‌న్యూస్‌.. మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్‌.. ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో మ‌రో డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం క‌సర‌త్తు చేస్తుంద‌ని తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. 11062 టీచ‌ర్ పోస్టుల‌కు డీఎస్సీ-2024ను జులై 18వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.
Again DSC 2024 Notification Details  Another dsc notification again in telengana

ఈ ఉద్యోగాల ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే... మ‌రో 6000 టీచ‌ర్ ఉద్యోగాల‌కు వ‌చ్చే జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రిలో మ‌రో నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి  ఏటా రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) జరుపుతామని ప్ర‌భుత్వం తెలిపిన విష‌యం తెల్సిందే. ప్ర‌తి ఏడాది జూన్, డిసెంబరులో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీఓ జారీచేసింది. దాని ప్రకారం డిసెంబరులో టెట్‌ తర్వాత.. డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసినా 45 రోజుల గడువు తప్పనిసరి. అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పోస్టులు ఇలా..
11062 టీచ‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీ చేస్తే.. ఇక 5000 నుంచి 6000 వరకు ఉపాధ్యాయ ఖాళీలుంటాయని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200-300 మంది టీచర్లు పదవీ విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు మొత్తం 1,25,058 ఉండగా.. పనిచేస్తున్నవారు 1.03 లక్షల మంది ఉన్నారు.

☛ TS DSC 2024 Competition : టీఎస్ డీఎస్సీ-2024కి భారీగా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఇవే.. ఒక్కొక్క పోస్టుకు ఇంత‌ మంది పోటీనా..?

Published date : 16 Jul 2024 06:27PM

Photo Stories