Free Admissions: VIT–APలో 48 మంది పేద విద్యార్థులకు స్టార్స్ పథకం ద్వారా ఉచిత ప్రవేశం
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలలో జిల్లా టాపర్లుగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు స్టార్స్ (సపోర్ట్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్) పథకం ద్వారా ఉన్నత విద్యను ఉచితంగా అందించేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. వీరికి విద్య, వసతి సౌకర్యాలలో 100 శాతం ఫీజు మినహాయింపును అందించనున్నట్టు వివరించారు.
ఈ పథకాన్ని తొలుత తమిళనాడులోని వెల్లూరులో వీఐటీ విశ్వ విద్యాలయంలో 2008లో వ్యవస్థాపక చాన్స్‌లర్ జి.విశ్వనాథన్ చేతుల మీదుగా ప్రారంభించి తదనంతరం వీఐటీ– చైన్నె, వీఐటీ–ఏపీ, వీఐటీ–భోపాల్ క్యాంపస్‌లకు విస్తరించినట్లు తెలిపారు.
చదవండి: Students Talent : ఆసక్తితో సాధన చేస్తే గెలుపు మనదే!
విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ వీఐటీ– ఏపీ విశ్వ విద్యాలయం విద్యార్థుల కలలను సాకారం చేస్తుందన్నారు.
కార్యక్రమంలో అడ్మిషన్స్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జాన్ ప్రదీప్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ మిశ్రా, స్టార్ పథకం కో ఆర్డినేటర్ డాక్టర్ వెంకట లక్ష్మీ, చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుంటి దయానంద్ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.