Skip to main content

Artificial Intelligence: గోండు భాషలో మాట్లాడినా.. అమెరికా అధ్యక్షుడికి అర్థమయ్యేలా మారిపోతుంది

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి దాకా పోగేసింది రూ.లక్ష. దాన్ని రెట్టింపు చేయాలనుంది. మనసులోని ఈ మాటను ‘చాట్‌ జీపీటీ’కి చెప్పడమే ఆలస్యం.. రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకూ చేయగల బిజినెస్‌ ప్రోగ్రాం రెడీ చేసి పెడుతుంది.
Retrieval Augmented Generation

ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు గోండు భాషలో మాట్లాడితే.. అమెరికాలో ట్రంప్‌ విని అవలీలగా అర్థం చేసుకునేలా మారిపోతుంది. అమెరికా, ఆఫ్రికా వాళ్లు ఏ భాషలో మాట్లాడినా.. మనకు తెలుగులోనే వినిపిస్తుంది. మనం తెలుగులో మాట్లాడుతుంటే.. వాళ్లకు అర్థమయ్యే భాషలో వారికి వినిపిస్తుంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన, సృష్టించబోతున్న ఇలాంటి అద్భుతాలు ఎన్నో. ఏఐ సృష్టించే కొత్త భాషతో మారుమూల ప్రాంతాల్లోని వారి మనోగతంతో సహా విశ్లేషించే టెక్నికల్‌ టూల్‌ను చూడబోతున్నాం. ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్న ఆ టూల్‌.. ‘రిట్రైవల్‌–అగ్మెంటెడ్‌ జనరేషన్‌ (ర్యాగ్‌)’. 

చదవండి: Artificial Intelligence : డిజిటల్‌ యుగంలో అన్ని రంగాలకు విస్తరిస్తున్న కృత్రిమ మేథ.. భవిష్యత్‌లో భారీగా కొలువులు!

‘ర్యాగ్‌’ కోసం భారీ పెట్టుబడులు 

చాట్‌ జీపీటీ వచ్చిన తర్వాత కృత్రిమ మేధ టూల్స్‌పై అంతర్జాతీయ సంస్థలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. ఐడీసీ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2028 నాటికి రూ.50లక్షల కోట్లకుపైనే (632 బిలియన్‌ డాలర్లు) ఖర్చుపెట్టనున్నాయి. మన భారతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే ఏఐ టూల్స్‌ కోసం వెచ్చిస్తున్నాయి. తక్కువ వనరులతో అత్యంత అద్భుతంగా పనిచేసే సామర్థ్యం ర్యాగ్‌ టూల్స్‌కు ఉంటుందని టెక్‌ నిపుణులు చెప్తున్నారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఏంటీ దీని ప్రత్యేకత? 

మన దేశంలోని మారుమూల పల్లెలో మాట్లాడే స్థానిక భాషను అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకునేలా చేయగల సత్తా ర్యాగ్‌ టూల్స్‌కు ఉంటుంది. కొన్ని వేల భాషలను, కోట్ల కొద్దీ పదాలను అత్యంత వేగంగా విశ్లేíÙంచగలవు. కృత్రిమ మేధలోని డీప్‌ లెరి్నంగ్‌ సాంకేతికతను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసి ఈ టూల్స్‌ను రూపొందించినట్టు నిపుణులు చెప్తున్నారు.

ఉదాహరణకు కొన్ని పోలికలతో వధువు కావాలని జీపీటీలో సెర్చ్‌ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా సరిపోయే వ్యక్తులు, వారి అలవాట్లు, వారి హావభావాలతో చిత్రాలను అందిస్తుంది. సీ, సీ ప్లస్‌ ప్లస్, డెవాబ్స్‌ వంటి అనేక కంప్యూటర్‌ కోడింగ్‌ భాషలున్నాయి. ర్యాగ్‌ టూల్స్‌ క్షణాల్లోనే ఆ భాషల్లో కోడింగ్స్‌ రాయగలవు. కాల్‌ సెంటర్లలో కొన్ని వేల మంది చేసే పనిని ఒక్క ర్యాగ్‌ టూల్‌తో సాధించవచ్చు. కంపెనీల ఆడిట్‌ రిపోర్టులు, అంతర్గత వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యాపార లింకులు వంటి పనులెన్నో ర్యాగ్‌తో ఇట్టే ముగించే వీలుంది. 

ఉపాధికి దెబ్బపడుతుందా? 

సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న వారికి ‘ర్యాగ్‌’ టూల్స్‌తో చాలెంజ్‌ అనే చెప్పాలని నిపుణులు అంటున్నారు. కాల్‌ సెంటర్‌ ఉద్యోగాల నుంచి కోడింగ్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల దాకా ఉపాధి తగ్గుతుందని.. కార్యాలయాల్లో పనిచేసే పద్దతులు మారిపోతాయని చెప్తున్నారు. ఎక్కడో ఉండి మరెక్కడో కంపెనీని నడిపే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని వివరిస్తున్నారు. 

పోటీ పడితేనే అవకాశాలు.. 

మన దేశంలో ఏటా 24 లక్షల మంది టెక్‌ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వారిలో కేవలం 8 శాతం మందికే తగిన స్కిల్స్‌ ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. ఇక ముందు ర్యాగ్‌తో పోటీ పడి, అంతకన్నా మెరుగైన ఆలోచనతో పనిచేసే వారికే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఏఐతో పోటీపడే తెలివితేటలు ఉంటే తప్ప, కొత్తగా, భిన్నంగా ఆవిష్కరించే సత్తా ఉంటే తప్ప నిలదొక్కుకోవడం కష్టమేనని పేర్కొంటున్నాయి. 

ఏఐతో పోటీ పడితేనే రాణించగలం 
చాట్‌ జీపీటీ సహా ఏఐ ప్రయోగాలు ముందుకెళ్తున్న నేపథ్యంలో ‘ర్యాగ్‌’ సాంకేతికత మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. డీప్‌ లెరి్నంగ్‌లో భాగంగా దీనిపై విద్యార్థులకు అవగాహన కలి్పస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఇక మీదట ఏఐతో పోటీపడి, క్రియేటివిటీని రుజువు చేసుకుంటేనే సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.  
– డాక్టర్‌ కేపీ సుప్రీతి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్‌ 
 

‘ర్యాగ్‌’ కోసం భారీ పెట్టుబడులు 

చాట్‌ జీపీటీ వచి్చన తర్వాత కృత్రిమ మేధ టూల్స్‌పై అంతర్జాతీయ సంస్థలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. ఐడీసీ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2028 నాటికి రూ.50లక్షల కోట్లకుపైనే ఖర్చుపెట్టనున్నాయి. మన భారతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే ఏఐ టూల్స్‌ కోసం వెచి్చస్తున్నాయి. తక్కువ వనరులతో అత్యంత అద్భుతంగా పనిచేసే సామర్థ్యం ర్యాగ్‌ టూల్స్‌కు ఉంటుందని టెక్‌ నిపుణులు చెప్తున్నారు. 

Published date : 26 Oct 2024 11:57AM

Photo Stories