Skip to main content

ప్రైవేట్ కాలేజీల ఫీజులపై విచారణ.. తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ కమిటీ సీరియస్‌!

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై ప్రభుత్వం కఠిన దృష్టి పెట్టింది. ఫీజు నిర్మాణం, మౌలిక వసతులు, బోధన సిబ్బంది తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నిర్ణయించింది.
engineering colleges fee staff inspection report

ఈ కమిటీలో ఆడిట్‌, టౌన్‌ప్లానింగ్‌, సాంకేతిక విద్య, ఉన్నత విద్య విభాగాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. వారు ఉపకమిటీలుగా ఏర్పడి, ప్రతి కాలేజీని ఫీల్డ్ లెవల్లో పరిశీలించనున్నారు. అఫిలియేషన్ జాబితాలో ఉన్న అన్ని కాలేజీలను వారంలోపు పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు:

అక్రమంగా స్థలాలను ఉపయోగించడం, ఇతర ప్రాంతాల్లో కాలేజీలు నడిపించడం, అధ్యాపకుల కొరత, జీతాల చెల్లింపుల లోపం వంటి పలు అంశాలపై ప్రభుత్వం ఫిర్యాదులు అందుకుంది.

AICTE సమర్పించిన డాక్యుమెంట్లలో సరైన సమాచారం లేకపోవడం, నిషేధిత భూముల్లో కాలేజీలు నడిపించడంపై టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

చదవండి: Impact of AI: ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్.. ఇవే ఏఐ ప్రభావానికి గురయ్యే ఉద్యోగాలు!

ఆడిట్ నివేదికలు కీలకం:

2022–2025 మధ్యకాలంలో కాలేజీలు సమర్పించిన ఆడిట్ నివేదికలను టీఎస్‌ఎఫ్‌ఆర్సీ పకడ్బందీగా పరిశీలించనుంది. అవసరమైతే బ్యాంక్ లావాదేవీలను కూడా చెక్ చేయనున్నారు.

20 కాలేజీలపై ఇప్పటికే తీవ్రమైన ఫిర్యాదులు వచ్చాయని, ఫ్యాకల్టీ లేకుండా ఎమర్జింగ్ కోర్సులు నడుపుతున్నాయని, మరియు జీతాలు చెల్లించకపోవడం లాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్, అనుమతుల రద్దు, లేదా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Aug 2025 03:54PM

Photo Stories