Skip to main content

AI Courses: పీయూలో త్వరలో కృత్రిమమేధా కోర్సులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో త్వరలో కృత్రిమేధా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.
AI courses coming soon in PU

ఈ మేరకు పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో టీజీ కాస్ట్‌ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో కృత్రిమేధా ఎంతో కీలకంగా మారనుందని, అందుకే ఆ కోర్సును తీసుకొస్తామన్నారు.

సైన్స్‌ సబ్జెక్టులకు అన్నింటికి మూలం గణితమేనని, దాని విశ్లేషణ లేకుండా రీసెర్చ్‌ మనుగడ లేదన్నారు. కర్ణాటక దేవన్గిరీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ పీజీ స్థాయిలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు బోధన రంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా అనేక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.

చదవండి: Rashmika Mandanna: జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమితులైన రష్మిక

విద్యార్థులకు గణితం అంటే భయపడే పరిస్థితి ఉందని, కొంత శ్రమపడితే గణితంతో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. లేటెస్క్కా, మ్యాథమెటికా, మాథమాటి, ల్యాబ్స్‌ ఫోనిక్స్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ల ద్వారా వివిధ అంశాలపై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయని, సాఫ్ట్‌వేర్‌ల వినియోగంపై పీయూ విద్యార్థులకు ఉచితంగా ఒక్క వారంపాటు అవగాహన నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా వ్యాసరచన, క్విజ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్‌, రవీందర్‌రెడ్డి, కో కన్వీనర్‌ మధు, నాగరాజు, సురేష్‌, భారతి తదితరులు పాల్గొన్నారు.

Published date : 30 Oct 2024 04:39PM

Photo Stories