Rashmika Mandanna: జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమితులైన రష్మిక
Sakshi Education
ప్రముఖ సినీ నటి రష్మిక మందన్నకు కీలకమైన బాధ్యతలు దక్కాయి.
భారత హోం వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు ఆమెను జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమించారు.
రష్మికకు అప్పగించిన ఈ బాధ్యత, సైబర్ భద్రతపై అవగాహనను బలోపేతం చేయడం. అలాగే.. భారతదేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ల సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం కోసం జరిగింది.
దీంతో రష్మిక సైబర్ బెదిరింపులు గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆన్‌లైన్ మోసాలు, డీప్‌ఫేక్ వీడియోలు, హానికరమైన ఏఐ(AI) రూపొందించిన కంటెంట్ వంటి వివిధ మోసాలపై ప్రజల్లో అవగాహన సృష్టించడానికి ఆమె ప్రచారం చేయనున్నారు.
Arti Sarin: AFMS డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ
Published date : 18 Oct 2024 09:53AM