Chris Wright: అమెరికా ఇంధన మంత్రిగా నియమితులైన క్రిస్ రైట్
ట్రంప్‌నకు క్రిస్ రైట్ భారీగా విరాళాలు అందజేశారు. ఆయన ప్రచారానికి సహకరించారు. డెన్వర్‌లోని లిబర్టీ ఎనర్జీ అనే సంస్థకు క్రిస్ రైట్ సీఈఓగా పని చేస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆయన ప్రోత్సహిస్తుంటారు. చమురు, గ్యాస్ ఉత్పత్తకి గట్టి మద్దతుదారుడు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు.
కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ప్రపంచమంతా శిలాజేతర ఇంధన వనరుల వైపు పరుగులు తీస్తుండగా, ట్రంప్ మాత్రం శిలాజ ఇంధనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంధన మంత్రిగా క్రిసరైట్‌ను నియమించడంతో అమెరికా శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలంటే శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరగాలని క్రిస్ రైట్ వాదిస్తున్నారు.
US Elections: అమెరికా ఎన్నికల్లో.. విజయం సాధించిన ఆరుగురు భారతీయులు.. వారు ఎవరంటే..
ఆయన గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వంలో పని చేసిన అనుభవం ఆయనకు లేదు. క్రిస్ రైట్‌ను ఇంధన శాఖ మంత్రిగా ట్రంప్ నియమించడం వెనుక అమెరికాలోని చమురు లాబీ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.