Miss Universe 2024: 'విశ్వ సుందరి'గా డెన్మార్క్ బ్యూటీ
డెన్మార్క్ భామ విశ్వ సుందరిగా నెగ్గడం ఇదే మొట్టమొదటిసారి. 73వ మిస్ యూనివర్స్ పోటీ మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో నవంబర్ 16వ తేదీ జరిగింది. 120కి పైగా దేశాల నుంచి అందాల సుందరీమణులు పాల్గొన్నారు.
విక్టోరియా మొదటిస్థానంలో నిలిచింది. మిస్ నైజీరియా చిడీమా అటెస్తినా రెండో స్థానంలో, మిస్ మెక్సికో మారియా ఫెర్నాండా బెల్ట్రాన్ మూడో స్థానంలో నిలిచారు.
2023లో మిస్ యూనివర్స్ విజయం సాధించిన నికరాగ్వా సుందరి షెన్నిస్ పాలాసియో 2024గాన మిస్ యూనివర్స్‌గా నెగ్గిన విక్టోరియాకు లాంఛనంగా కిరీటం అలంకరించారు.
Miss Teen Universe : మిస్ టీన్ యూనివర్స్–2024గా కీరీటం గెలిచిన ఒడిషా యువతి
21 ఏళ్ల విక్టోరియా వజ్రాలు విక్రయించే సంస్థలో పని చేస్తున్నారు. జంతువుల రక్షణ కోసం పోరాడుతున్నారు. మరోవైపు మిస్ యూని వర్స్ పోటలో భారత్ తరపున రియా సింఘా పాలుపంచుకున్నారు. టాప్-30 సెమీఫైనలిస్టుల జాబితాలో స్థానం సంపాదించారు.
మెక్సికోలో మిస్ యూనివర్స్ పోటీ జరగడం ఇది మూడోసారి. బెలారస్, ఎరిత్రియా, గినియా, మకావు, మాల్దీవ్స్, మాల్హోవా, ఉజ్బె కిస్తాన్ దేశాలు తొలిసారిగా పోటీలో పాల్గొన్నాయి.
Rachel Gupta: తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన అందాల రాణి ఈమెనే..