Skip to main content

Miss Teen Universe : మిస్‌ టీన్‌ యూనివర్స్‌–2024గా కీరీటం గెలిచిన ఒడిషా యువతి

Odisa young girls wins the crown miss teen universe 2024  Trishna Ray crowned Miss Teen Universe 2024  Miss Teen Universe 2024 winner from India

ఒడిషా యువతి తృష్ణా రే ‘మిస్‌ టీన్‌ యూనివర్స్‌–2024’ కిరీటం గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ నగరంలో ఈ నెల 1 నుంచి 9వ తేదీ దాకా జరిగిన మిస్‌ టీన్‌ యూనివర్స్‌ పోటీలో విజేతగా నిలిచింది. పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్స్‌ తదితర దేశాల నుంచి 10 మంది ఫైనల్‌కు చేరుకోగా, ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల తృష్ణా రే వారందరినీ వెనక్కి నెట్టి అందాల సుందరి కిరీటం సొంతం చేసుకుంది.

Software Company Director : సాఫ్ట్‌వేర్ కంపెనీ డైరెక్ట‌ర్‌కు హాయోలో కీల‌క విధులు..

పెరూ దేశానికి చెందిన అన్నే థార్సెన్‌ మొదటి రన్నరప్‌గా, నమీబియాకు చెందిన ఆండ్రి రెండో రన్నరప్‌గా నిలిచారు. కల్నల్‌ దిలీప్‌ కుమార్‌ రే, రాజశ్రీ రే దంపతుల కుమార్తె అయిన తృష్ణా రే ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్‌ టెక్నాలజీ చదువుతోంది. – న్యూఢిల్లీ

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Nov 2024 09:56AM

Photo Stories