Skip to main content

Prof BS Murty: ‘స్టార్టప్‌’లతో వికసిత భారత్‌!.. డ్రైవ‌ర్‌ రహిత వాహనాల పరిశోధనలు

వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రారంభించే దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని... ఇందుకోసం ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని ఐఐటీ–హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బూదరాజు శ్రీనివాస మూర్తి (బీఎస్‌ మూర్తి) తెలిపారు. విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం రావాలని.. నచ్చిన రంగాలకు సంబంధించిన కోర్సులు ఎంచుకుంటేనే విద్యార్థి ఆ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. తాము దేశంలోనే తొలి­సారిగా 2019లోనే కృత్రిమ మేధ (ఏఐ) బీటెక్‌ కోర్సు­ను ప్రవేశపెట్టామని.. ఇప్పుడు సెమీకండక్టర్ల రంగానికి సంబంధించి ‘ఎంటెక్‌ ఇన్‌ ఐసీ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ’, ‘బీటెక్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌’ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇన్నో­వేషన్‌­తోనే వికసిత భారత్‌ సాధ్యమవుతుందన్నా­రు. ఐఐటీహెచ్‌లో పరిశోధన­లతోపాటు పలు ఇతర అంశాలపై బీఎస్‌ మూర్తి ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ విశేషాలు ఆయన మాటల్లోనే..
India developed with startups  IIT Hyderabad Director Professor BS Murthy encouraging students to start startups with innovative ideasProfessor BS Murthy discussing student-centered education at IIT Hyderabad

పరిశోధనలకే ప్రాధాన్యం..

ఐఐటీహెచ్‌ మొదటి నుంచీ పరిశోధనలపై ఫోకస్‌ పెట్టింది. 6జీ, 5జీ వంటి టెలికం, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, కోల్‌ రీసెర్చ్, కంప్యూటేషనల్‌ వంటి రంగాల్లో పరిశోధనలు ప్రగతిలో ఉన్నాయి. 2023–24లో పరిశోధనల కోసం రూ.250 కోట్ల నిధులు వచ్చాయి.

ఐఐటీహెచ్‌లో చదువుతున్న 5,300 మంది విద్యార్థుల్లో 60 శాతం మంది పీహెచ్‌డీ, ఎంటెక్‌ వాళ్లే. అందులోనూ సుమారు 1,500 మంది పీహెచ్‌డీ వాళ్లున్నారు.

చదవండి: Technozion 24: విద్యార్థులే నిర్వాహకులుగా.. ఏడాదిలో రెండుసార్లు..

స్టార్టప్‌ల దిశగా ప్రోత్సహిస్తున్నాం..

విద్యార్థులు వారి అభిరుచులకు అనుగుణంగా బీటెక్‌లో సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నాం. విద్యార్థులెవరికైనా స్టార్టప్‌ పెట్టాలనే ఆసక్తి ఉంటే బీటెక్‌ రెండో సంవత్సరం తర్వాత బయటికి వెళ్లి స్టార్టప్‌పై పనిచేసేందుకు అనుమతి ఇస్తున్నాం.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఐదేళ్లలో వారు తిరిగొచ్చి మిగతా రెండేళ్లు చదువు పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఇన్నోవేటివ్‌ ఐడియా ఉంటే వారికి రూ.లక్ష ఫండింగ్‌ ఇచ్చి.. స్టార్టప్‌ల దిశగా పనిచేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నాం. గత 14 ఏళ్లలో మా విద్యార్థుల భాగస్వామ్యంతో ఏకంగా 260 స్టార్టప్‌లు వచ్చాయి. వాటికి రూ.1,500 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయంటే సక్సెస్‌ రేట్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Published date : 12 Nov 2024 03:37PM

Photo Stories