D.Ed Exams Halltickets: నవంబర్ 4 నుంచి డీఎడ్ పరీక్షలు.. హాల్‌టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో డీఎడ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ దేవరాజు తెలిపారు. నవంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు డీఎడ్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు (2018–2020 బ్యాచ్ అభ్యర్థులు), డీఎడ్ రెండవ సెమిస్టర్ (2023–25) బ్యాచ్‌కు చెందిన వారికి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
DSC Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు..
అభ్యర్థులు హాల్ టికెట్లను www.bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ల్యాంగ్వేజ్ పండిట్ కోర్సు చదివే వారు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ తెలిపారు. ఎల్‌పీటీ, హెచ్‌పీటీ రెగ్యులర్, వన్స్ ఫెయిల్డ్ అభ్యర్థులకు పరీక్షల తేదీ త్వరలో వెల్లడిస్తామన్నారు.
KGBV Merit List Released: కేజీబీవీకి ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26వ తేదీలోపు, రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 31వ తేదీలోపు ఫీజు చెల్లించాలన్నారు. మూడు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అప్‌డేట్ చేసేందుకు ఈ నెల 22వ తేదీ నుంచి వెబ్‌సైట్ అందుబాటులో ఉందని వెల్లడించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)