Skip to main content

Students Talent : ఆస‌క్తితో సాధ‌న చేస్తే గెలుపు మ‌న‌దే!

Students talent in drawing competitions

చిత్రాలను గీయడంలో కొంచెం ఆసక్తి ఉంటే చాలు. మా పాఠశాలలో గురువులు చెబుతున్న మెలకువలు చాలా సులువుగా ఉంటాయి. మామూలుగా డ్రాయింగ్‌ క్లాస్‌లో చెప్పిన పాఠాలతోనే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు పోటీల్లో బంగారు పతకాలు సాధించేలా చిత్రాలు వేయగలుగుతున్నాను.

– టి.ఆదిలక్ష్మి, విద్యార్థిని

Time Management at Anganwadi : అంగ‌న్వాడీల్లో స‌మ‌య‌పాల‌న పాటించాలి.. ఈసీసీఈ డేలో..!

ఎక్కువ సమయం సాధన చేస్తా

డ్రాయింగ్‌ అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్‌. చిత్రాలను గీయడంపై సాధన కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుంటాను. మెలకువలు నేర్చుకోవడంతో మరింత దృష్టి సారించి పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరాను. పాఠశాల నుంచి వివిధ కాంపిటీషన్స్‌కు వెళ్లి బంగారు, వెండి పతకాలు సాధించాను.

– ఎన్‌.జోషిక, విద్యార్థిని

NIT Warangal: క్యాంపస్‌ సెలక్షన్స్‌లో వరంగల్‌ నిట్‌ విద్యార్థుల జోరు

మెలకువలు నేర్పించారు

డ్రాయింగ్‌ తరగతి అంటే నాకు చాలా ఇష్టం. డ్రాయింగ్‌ నేర్పించే విధానం చాలా బావుంటుంది. అర్థమయ్యే రీతిలో చెప్పడమే కాకుండా సులువుగా చిత్రాన్ని వేసేలా ఉపాధ్యాయులు మెలకువలు నేర్పించారు. అందుకే నేను పాల్గొనే ప్రతి పోటీలో పతకాలు సాధిస్తుంటాను.

– ఎన్‌.ఖ్యాతిక, విద్యార్థిని

Change Name in Certificates: సర్టిఫికెట్లపై పేరు మార్చి ఇస్తే నష్టమేంటి ?: హైకోర్టు

Published date : 13 Jul 2024 09:24AM

Photo Stories