MBBS Seats: కన్వీనర్ కోటా సీట్లు కేటాయించని ఆరోగ్య విశ్వవిద్యాలయం.. ఇంకెన్ని రోజులు?
2024–25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా మూడో దశ సీట్ల కేటాయింపు నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీకన్నా ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రంలో సైతం మూడో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా గత అక్టోబర్ 21న సీట్లను కేటాయించారు.
ఆల్ ఇండియా కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయి మాప్ అప్ రౌండ్ ప్రారంభం కానుంది. అయితే.. ఏపీలో మాత్రం ఇంకా సీట్లు కేటాయించలేదు. ఒకవైపు తరగతులు ప్రారంభమయ్యాయి. మరోవైపు మూడో రౌండ్‌లో సీటు వస్తుందో లేదో నిర్ధారించుకుని లాంగ్‌టర్మ్ కోచింగ్ వెళ్లడం, లేదంటే ప్రత్యామ్నాయంగా వెటర్నరీ, ఆయుష్, బీడీఎస్ కోర్సులకు వెళ్లాలని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు.
చదవండి: Health and Family Welfare: మెడికల్ కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
ఇప్పటికే బీడీఎస్ మొదటి విడత కన్వీనర్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ఆయుష్ కోర్సులకు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. కౌన్సెలింగ్ కూడా మొదలు కాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకాక విద్యార్థులు 700 ఎంబీబీఎస్ సీట్లు నష్టపోయారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త కళాశాలలు ప్రారంభమై పోటీకి తగ్గట్టుగా సీట్లు పెరగడంతో కటాఫ్ గణనీయంగా తగ్గాయి. పక్క రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో 150 మార్కుల మేర కటాఫ్ ఎక్కువగా ఉంటోంది.