ITI Admissions: ఐటీఐలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..
వీటిలో ప్రవేశం పొందేందుకు అర్హత గల విద్యార్థులు అక్టోబర్ 30వ తేదీలోగా http://iti.telang ana.gov.in వెబ్‌సైట్‌లో తమ మొబైల్ నంబరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్ హాజరుకావాలి. జిల్లాలోని విద్యార్థినులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర అక్టోబర్ 27నఒక ప్రకటనలో కోరారు.
చదవండి: Manda Makarand IAS: రూ.30 లక్షల జీతం వదులుకుని... మున్సిపల్ కమీషనర్ గా
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ చదువుకున్న నిరుద్యోగులకు వివిధ వృత్తుల్లో నైపుణ్యాలు పెంపొందింపజేసి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో మొత్తం 172 సీట్లు ఉన్నాయన్నారు. సంవత్సరం వ్యవధి కలిగిన మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రీయల్ రోబెటిక్స్ అండ్ డిజిటల్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
రెండేళ్ల వ్యవధి కలిగిన బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిౖఫైర్ (మెకానికల్), అడ్వాన్స్ సీఎస్‌సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ కోర్సులు చేయవచ్చన్నారు. అభ్యర్థులు ముందుగానే ఒరిజినల్ పదో తరగతి మెమో, కుల, స్థానిక ధ్రువీకరణ పత్రాలు, బోనోఫైడ్, టీసీ సర్టిఫికెట్లు తమ ఫొటో సహా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అలాగే దరఖాస్తు ప్రింటెండ్ కాపీతోపాటు ఈ సర్టిఫికెట్లు తీసుకుని నేరుగా మహబూబ్‌నగర్‌లోని బాలికల ఐటీఐలో హాజరుకావాలన్నారు.