Skip to main content

IT Jobs: ఐటీలో నియామకాల సందడి!.. వీరికి డిమాండ్‌ ఎక్కువ

ముంబై: ఐటీ రంగంలో మళ్లీ నియామకాలు పుంజుకోనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 8.5 శాతం మేర పెరుగుతాయని ఓ నివేదిక తాజాగా అంచనా వేసింది.
Busy recruitment in IT Jobs  Recruitment growth prediction for the IT sector  increase in IT sector job opportunities forecasted

గత రెండేళ్లుగా ఐటీ రంగంలో నియామకాల పరంగా స్తబ్దత వాతావరణం నెలకొనడం తెలిసిందే. గతేడాది నిపుణులకు ఐటీ రంగంలో డిమాండ్‌ తగ్గగా.. ఇకపై నియామకాలు పుంజుకోనున్నట్టు సదరు నివేదిక తెలిపింది. కంపెనీలు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) బ్లాక్‌చైన్‌ వంటి సాంకేతికతలను  వినియోగిస్తుండంతో సాఫ్ట్‌ వేర్‌ డెవలపర్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతు న్నట్లు వివరించింది.

స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ బలపడుతుండడాన్ని సైతం ప్రస్తావించింది. ఇండీడ్‌ సంస్థకు చెందిన హైరింగ్‌ ట్రాకర్‌, ఇండీడ్‌ ప్లాట్‌ ఫామ్‌ ఇండియా డేటా ఆధారంగా ఈ వివరాలు విడుదల చేసింది. ప్రస్తుతం తమ ప్లాట్‌ ఫామ్‌పై నమోదయ్యే నియామకాల్లో 70 శాతం సాఫ్ట్‌వేర్‌ ఆధారితమేనని ఈ సంస్థ తెలిపింది.

చదవండి: ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

వీరికి డిమాండ్‌ ఎక్కువ

అప్లికేషన్‌ డెవలపర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, పీహెచ్‌పీ డెవలపర్‌ నియామకాలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. అలాగే, నెట్‌ డెవలపర్లు, సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌, డెవ్‌ఆప్స్‌ ఇంజనీర్‌, డేటా ఇంజనీర్‌, ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌లకు సైతం డిమాండ్‌ పెరుగుతున్నట్టు తెలిపింది.

ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటిక ప్పుడు అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు, కొత్త ఫీచర్లు తీసుకురావాల్సిన అవసరం సైతం డిమాండ్‌కు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. ‘‘ఐటీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇటీవలి త్రైమాసికాల్లో నియామకాలు తగ్గుముఖం పట్టాయి.

అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. కంపెనీలు అప్రమత్త ధోరణితో వ్యవహరించాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు చోటు చేసుకుంటోంది. కంపెనీలు నియామకాలు పెంచుకోవడంపై దృష్టి సారించాయి.గ్లోబల్‌ క్యాపబు లిటీ సెంటర్లు (జీసీసీలు) ఈ నియామకాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి’’అని నివేదిక పేర్కొంది.

Published date : 10 Aug 2024 03:13PM

Photo Stories