Skip to main content

TS DSC 2024 Competition : టీఎస్ డీఎస్సీ-2024కి భారీగా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఇవే.. ఒక్కొక్క పోస్టుకు ఇంత‌ మంది పోటీనా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ డీఎస్సీ-2024కి ద‌ర‌ఖాస్తు గ‌డువు జూన్ 20వ తేదీతో ముగిసిన విష‌యం తెల్సిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,062 టీచర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఈ పోస్టుల‌కు 2,79,966 మంది దరఖాస్తు చేసుకున్నార‌ని.. విద్యాశాఖ ప్రకటించింది.
Telangana DSC-2024 application deadline  TS DSC 2024 Competition Ratio   Telangana DSC-2024 Notification details

మొత్తం మీద చూస్తే ఒక్కొక్క పోస్టుకు 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణ డీఎస్సీ ప‌రీక్ష‌లు జూలై 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టీఎస్ డీఎస్సీ-2024 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను పరీక్షకు వారం ముందు విడుదల చేయనున్నారు. పోస్టుల విభాగాల వారీగా పోస్టుల సంఖ్య, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను కింద ఇవ్వడం జరిగింది.

☛ 16347 AP Teacher Jobs Details 2024 : త్వ‌ర‌లోనే 16,347 డీఎస్సీ పోస్టులకు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

టీఎస్ డీఎస్సీ-2024కి పోస్టుల వారిగా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఇవే..

ts dsc 2024 applications

☛ స్కూల్ అసిస్టెంట్  పోస్టులు 2,629 : వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 1,60,296

☛ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,508 : వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 85,916

☛ లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727 : వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 18,211

☛ పీఈటీ పోస్టులు 182 : వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 11,992

 Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు.. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తు వివరాలు ఇవే..

☛ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 : వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 1,455

☛ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల‌ 796 : వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 2,096

    మొత్తం పోస్టులు 11,062 : వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 279,966

Published date : 24 Jun 2024 08:32AM

Photo Stories