Skip to main content

TS DSC 2024 Postpone Update : టీఎస్ డీఎస్సీ-2024 వాయిదా పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థులు కోరుతున్న విష‌యం తెల్సిందే. డీఎస్సీ 2024 పరీక్షలను జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
TS DSC 2024 Exams Postponed News Telengana education news

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8లో నిర్వహించడానికి ఇప్పటికే తేదీలు ప్రకటించింది. అయితే డీఎస్సీకి గ్రూప్–2 కు మధ్య కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసి.. డీఎస్సీ-2024 ప‌రీక్ష‌లు యధాతధంగా నిర్వ‌హించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు విద్యా శాఖకు.., తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వాలు సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

☛ TS DSC 2024 Competition : టీఎస్ డీఎస్సీ-2024కి భారీగా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఇవే.. ఒక్కొక్క పోస్టుకు ఇంత‌ మంది పోటీనా..?

గ్రూప్‌-2 వాయిదా..?
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-2 వాయిదా వేయ‌నున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జూలై 6వ తేదీన (శనివారం) రానున్న‌ది. అలాగే TSPSC గ్రూప్–2 పోస్టుల సంఖ్య పెంచాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌లు ఒకదాని వెంటే మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో పరీక్షల వాయిదా అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-2 వాయిదా వేయిదాకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ గ్రూప్‌-2 పోస్టుల‌ను పెంచి.. ఈ ప‌రీక్ష‌ల‌ను డిసెంబ‌ర్‌లో నిర్వ‌హించాలి అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు.

 TS Mega DSC 2024 Demand : 25000 ఉద్యోగాల‌తో మెగా డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇవ్వాలి.. లేదంటే..!

Published date : 06 Jul 2024 05:51PM

Photo Stories