Skip to main content

TG DSC Result 2024 Release : ఈ వారంలోనే డీఎస్సీ-2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. దీనిపై క్లారిటీ..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : మొద‌టి నుంచి.. డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌న‌తో పాటు.. కీ పై కూడా ఎన్నో వివాదాలు న‌డుస్తున్నాయి. అయితే కీ లోని త‌ప్పులను స‌రిచేసి... ఫ‌లితాల విడుద‌ల‌కు అధికారులు ఏర్పాట్ల‌ల‌ను చేస్తున్నారు.
Controversies surrounding DSC 2024 key and exam results  Correction of DSC 2024 key errors by authorities  DSC 2024 exam results preparation after key corrections TS DSC 2024 Result Release Date  DSC 2024 exam controversies and key errors

అలాగే ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు కూడా డీఎస్సీ 2024 ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే డీఎస్సీ ప్రాథ‌మిక‌, ఫైనల్‌ కీ కూడా విడుదలైంది. 

డీఎస్సీ ఫ‌లితాలు ఏక్ష‌ణంలోనైన విడుద‌ల‌...?
డీఎస్సీ-2024 ఫ‌లితాలు నేడో రేపో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే.. గతంలో ఎంటర్‌ చేసిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌)లో వివరాల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ గడువు కూడా ముగియడంతో ఫలితాల విడుదలకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ తుది మార్కులు ప్రకటనకు సిద్ధ‌మౌతున్న‌ విద్యాశాఖ ఈ మేరకు అభ్యర్ధులకు అవకాశం ఇచ్చింది. ఈ మేర‌కు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని కుదిరితే... డీఎస్సీ-2024 ఫ‌లితాలు సెప్టెంబ‌ర్ 18వ తేదీ లేదా.. 19వ తేదీన విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. అయితే డీఎస్సీ-2024 ఫ‌లితాల విడుద‌ల‌పై ఇంకా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎటువంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

టెట్‌ మార్కులను కలిపి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను..
తాజాగా డీఎస్సీ తుది కీ విడుదలవడంతో త్వరలోనే ఫలితాలు (TS DSC Result 2024) కూడా ప్రకటించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అయితే టెట్‌ పరీక్ష అనంతరం వచ్చిన మార్కులను డీఎస్సీ దరఖాస్తులో నమోదు చేయలేదని కొందరు, మార్కులు, హాల్‌టికెట్, సబ్జెక్ట్‌ ఎంట్రీ వంటి పలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో తప్పులు దొర్లాయని మరికొందరు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయంకి చేరుకుని సవరణకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తులపై స్పందించిన విద్యాశాఖ.. రెండు రోజులపాటు టెట్ వివరాల నమోదుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో డీఎస్సీ మార్కులకు టెట్‌ మార్కులను కలిపి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేస్తారు. 

1:3 నిష్పత్తిలో మెరిట్‌ లిస్టు..
ఈ ప్రక్రియ ముగిస్తే టెట్‌ మార్కుల అప్‌డేట్‌ చేసేందుకు ఇక అవకాశం ఇండదు. దీంతో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముందుకొచ్చింది. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదల చేసిన తర్వాత 1:3 నిష్పత్తిలో మెరిట్‌ లిస్టు ప్రకటిస్తారు. వారందరికీ డీఈవోలు ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు. అనంతరం నియామక పత్రాలు అందజేస్తారు.

How to check TG DSC 2024 Results ?

Telangana DSC 2024 results are expected to be released this week or on September 4th week.   

  • Visit TG DSC official website https://tgdsc.aptonline.in/tgdsc
  • Click on TG DSC Merit list.
  • Click on your district.
  • The selected candidates list for certificate verifications will be displayed.
  • The final selected candidates list will be displayed after certificate verification.

TS DSC 2024 Vacancies List :

  • Physical Education Teacher: 182
  • SGT, Secondary Grade Teacher: 6508
  • School Assistant: 2629
  • Language Pandits: 727
  • Special Education Teachers in Primary Level: 796
  • Special Education Teachers in Upper Primary/Secondary Level in Government and Local Body Schools: 220

Here are the details of SGT and School Assistant posts by district :

  • Hyderabad: 537 SGT posts (highest)
  • Peddapalli: Only 21 SGT posts
  • Khammam: 176 School Assistant posts (highest)
  • Medchal Malkajgiri: 26 posts
  • Adilabad: 74 School Assistant and 209 SGT posts
  • Nalgonda: 383 SGT posts
  • Hanumakonda: 158 School Assistant and 81 SGT posts
  • Jagtial: 99 School Assistant and 161 SGT posts
  • Suryapet: 86 School Assistant and 224 SGT posts
  • Yadadri: 84 School Assistant and 137 SGT posts
Published date : 18 Sep 2024 08:09AM

Photo Stories