NAAC B Grade: ఈ డిగ్రీ కళాశాలకు న్యాక్ ‘బీ’ గ్రేడ్
అయితే కళాశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు, మౌలిక సదుపాయాలు అందిస్తుండడంతో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ‘బీ’ గ్రేడ్‌గా ఇటీవల ప్రకటించింది.
తమిళనాడులోని కర్పగం అకాడమి ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ వెంకట చలపతి, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నారాయణ ప్రసాద్, సుధాకర్ షెథ్, జేఎన్ పలివాల్ కళాశాల ప్రొఫెసర్ పల్లి రాయగడకు చెందిన న్యాక్ సభ్యులు అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన కళాశాలను సందర్శించి పరిశీలించారు.
చదవండి: First Women's College: నాక్ ఏ–ప్లస్ గ్రేడ్ పొందిన తొలి మహిళా కళాశాల ఇదే!
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక ఐదేళ్లలో చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను, కళాశాల నాణ్యతా ప్రమాణాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీంతో అన్ని ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం బెంగళూరులోని హెడ్ ఆఫీస్‌కు సీల్డ్ కవర్‌లో పంపించారు. దీంతో ఏటూరునాగారం ట్రైబల్ డిగ్రీ కళాశాలకు న్యాక్ ‘బీ’ గ్రేడ్‌ను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |