Skip to main content

TG DSC 2024 Certificate Verification Required Documents : డీఎస్సీ సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ప్రారంభం.. కావాల్సిన సర్టిఫికెట్స్‌ ఇవే...

సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ‌ డీఎస్సీ-2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 1వ తేదీ నుంచి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ప్రారంభ‌మైంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2024 ఫలితాలు సెప్టెంబరు 30వ తేదీన‌ విడుదలైన సంగతి తెలిసిందే.
TG DSC 2024 Certificate Verification Required Documents

అయితే డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉదయం 10:00 గంట‌ల‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను...
TG DSC 2024కి ధ్రువపత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసినట్లు ఆయన ఆయన వెల్లడించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం ఇవ్వనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితాను సంబంధిత డీఈఓలు ప్రకటిస్తారని ఆయన తెలిపారు. అభ్యర్థులు డీఈఓలు గుర్తించిన కేంద్రాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలని స్ఫష్టం చేశారు. 

డీఎస్సీ సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు కావాల్సిన ప‌త్రాలు ఇవే..
➤☛ విద్యార్హత ధ్రువపత్రాలు
➤☛ టెట్ సర్టిఫికెట్
➤☛ డీఎస్సీ హల్ టికెట్, దరఖాస్తు ఫారం
➤☛ కుల ధృవీకరణ పత్రం
➤☛ 1-7 తరగతుల స్టడీ సర్టిఫికెట్‌ (ఒరిజినల్‌)లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.
➤☛ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ లో ఉంచిన ఫారాన్ని నింపి సర్టిఫికెట్ లతో పాటు తీసుకుని వెళ్ళాలి.

ఉద్యోగాలకు ఎంపికైనవారికి అక్టోబర్ 9వ తేదీన‌ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని ఆయన తెలిపారు. 

రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజ‌రు అయ్యారు. 

అభ్యర్థుల జాబితాలను జిల్లాల వారీగా...
అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఫలితాల్లో కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటాయి. మెరిట్ ఆధారంగా.. ఎంపికైన అభ్యర్థుల జాబితాలను జిల్లాల వారీగా సంబంధిత డీఈవోలకు ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం... సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. డీఎస్సీ పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్ ర్యాంకులను వెల్లడించారు.

ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు..
అయితే జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్ మూడో స్థానంలో నిలిచింది. అక్కడ ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్త్తే రాష్ట్రంలో ఎక్కువ పోటీ వికారాబాద్ జిల్లాలోనే నెలకొనడం గమనార్హం.

నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకుగాను.. 6,508 ఎస్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు, స్పెషల్ కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు , 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షలకు హాజరయ్యారు.

Published date : 01 Oct 2024 02:43PM

Photo Stories