Free Coaching For AP DSC 2024 : ఏపీ డీఎస్సీ-2024కి ఫ్రీ కోచింగ్... అర్హతలు ఇవే...
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ 2024ను నవంబరు 3వ తేదీన విడుదల చేయనున్న విషయం తెల్సిందే. ఈ డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో ఏపీ డీఎస్సీ పరీక్షకు ప్రిపేరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఉచిత డీఎస్సీ కోసం అక్టోబర్ 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది.
ఈ వెబ్‌సైట్ ద్వారా..
ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన వారు https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. అక్టోబర్ 27వ తేదీ అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. అర్హులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తామంది.
ఈ డీఎస్సీ ఉద్యోగ నియామాక ప్రక్రియ.. డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ఏపీ డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యధావిధిగా పాత సిలబస్‌ను కొనసాగించడానికి నిర్ణయించింది.
Published date : 14 Oct 2024 02:51PM
Tags
- AP DSC 2024 Today News
- Free Coaching For AP DSC 2024
- AP DSC Free Coaching
- AP DSC Free Coaching News in Telugu
- ap government dsc free coaching
- ap government dsc free coaching news telugu
- telugu news ap government dsc free coaching
- ap government free coaching for dsc exam
- ap government free coaching for dsc
- ap government free coaching for dsc 2024
- ap government free coaching for dsc 2024 news telugu
- ap government dsc free coaching applications
- Jnanabhumi
- JnanabhumiWebPortal
- Jnanabhumi Web Portal
- jnanabhumi dsc applications
- free coaching online through Jnanabhumi web portal
- free coaching online through Jnanabhumi web portal news telugu