Skip to main content

DSC 2024 Counselling: ఎట్టకేలకు డీఎస్సీ – 2024 కౌన్సెలింగ్‌

కొత్తగూడెం అర్బన్‌: డీఎస్సీ – 2024లో ఎంపికై న నూతన ఉపాధ్యాయులకు పాతకొత్తగూడెంలోని తెలంగాణ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌(ఆనందఖని)లో అక్టోబర్ 15న కౌన్సెలింగ్‌ నిర్వహించారు.
Finally DSC 2024 Counseling

ఈ ప్రక్రియలో మొదట గందరగోళం నెలకొనడంతో అభ్యర్థులు కొంత నిరుత్సాహానికి గురైనా.. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ నిర్వహణతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తొలుత ఉదయం 10 గంటల వరకు నూతన ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ఎంపికై న ఉపాధ్యాయులు పాఠశాల వద్దకు చేరుకున్నారు.

ఈలోగా కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగా, ఇదే విషయాన్ని అభ్యర్థులకు తెలిపారు. దీంతో వారంతా నిరుత్సాహంగా వెనుదిరిగారు.

చదవండి: DSC 2024 Teachers Appointment: కొత్త టీచర్ల కేటాయింపు ఇలా...

కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, 317 జీవోతో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను, స్పౌజ్‌ ఉపాధ్యాయులను వారి ప్రాంతాలకు చేర్చే ప్రక్రియ జరిగిన తర్వాతే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. కానీ కాసేపటికే.. తిరిగి కౌన్సెలింగ్‌ నిర్వహించాలంటూ రాష్ట్ర విద్యాశాఖ నుంచి మళ్లీ సమాచారం అందింది. దీంతో వెంటనే జిల్లా విద్యాధికారులు నూతన ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో మేసేజ్‌ పెట్టి, మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. దీంతో తిరిగి వెళ్లిన 413 మంది ఆనందఖని పాఠశాలకు చేరుకున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఆ తర్వాత కౌన్సెలింగ్‌ చేపట్టి అర్హత, ర్యాంక్‌ల ఆధారంగా ఆయా పాఠశాలలకు కేటాయించారు. రాత్రి 9 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. కార్యక్రమంలో డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.

Published date : 16 Oct 2024 03:36PM

Photo Stories