Success Story : నన్ను ఒక అనాథగా రోడ్డున నెట్టేశారు.. నేడు ఏడాది రూ.100 కోట్లు సంపాదిస్తున్నానిలా.. ఈ కసితోనే.. కానీ...
తనను ప్రేమగా చూసుకోవాల్సిన అమ్మే.. తనను వదిలేసి వెళ్లిపోవడంతో చీనూ చాలా బాధ పడింది. ఇంతలోనే ఎంతోకొంతగా చూసుకుంటున్న తన తండ్రి కూడా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి చీనూ నరకం అంటే ఏమిటో కనపడింది.
అర్థరాత్రి సమయంలో బయటకు నెట్టేసి.. తలుపు వేశారు.. అప్పుడు..
చివరకు సవతి తల్లి.., సొంత తండ్రి అర్థరాత్రి సమయంలో బయటకు నెట్టేసి తలుపు వేశారు. అప్పుడు చీనూ వయసు 14 ఏండ్లు. ఆ చిన్నారి చీను తన దురదృష్టాన్ని నిందించుకుంటూ.. భారంగా అడుగులు వేసింది. ఇదే సమయంలో ఆమెలో భయం కంటే ఏదో తెలియని కసి పెరిగింది. తను ఛీదరించుకునే వారే కుళ్లుకునే స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఆలోచన అయితే బాగానే ఉంది కానీ చేతిలో చూస్తే రూ.300 మాత్రమే ఉన్నాయి. కానీ, మొండితనాన్నే ఆభరణంగా చేసుకుంది.
వీధులు, రైల్వేస్టేషన్‌లల్లో...
చాలా రోజులు ముంబయి వీధులు, రైల్వేస్టేషన్‌లే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితాన్ని గడిపింది. మరో వారం గడిచిన తరువాత చీనూ ఓ మహిళ కంటపడింది. సొంత అమ్మ కంటే మిన్నగా ఆదరించింది. ఓ కంపెనీలో చీనూకు ఉద్యోగం ఇప్పించింది. ఇంటింటికీ వెళ్లి నిత్యావసర వస్తువులు అమ్మడం పని. ఎన్ని ఎక్కువ అమ్మితే అంత కమీషన్ వచ్చేది.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోని..
ఇంటింటికీ తిరగడం వల్ల పెరిగిన పరిచయాలతో మూడేళ్ల తర్వాత సూరత్‌లో జాబ్ ఉందని తెలిసింది. సూరత్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే అమిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్ చెందిన అతను ఎంబీయే చదివాడు. వారిద్దరు 2004లో పెళ్లి చేసుకున్నారు. పలు ఉద్యోగాలు చేయడంతో చీనూకు ఆర్థిక పాఠాలూ ఒంటబట్టాయి.
చీనూ.. మిసెస్ ఇండియా అందాల పోటీలో పాల్గోని..
చీనూ 2007లో మిసెస్ ఇండియా అందాల పోటీలో పాల్గోని టాప్-10లో నిలిచింది. అనంతరం ఫ్యాషన్ డిజైన్ పై మెలుకువలు నేర్చుకుంది. బెంగళూరులో ఓ మాల్‌లో చిన్న మడిగ అద్దెకు తీసుకొని రుబన్స్ జువెలరీ ప్రారంభించింది. అనంతి కాలంలోలనే వారు స్థాపించిన రుబన్స్ బాగా అభివృద్ధి చెందింది.
తమ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు పైగానే..
2017 తర్వాత ఆన్‌లైన్ మార్కెట్ లోనూ రుబన్స్ మెరుపులు మొదలయ్యాయి. ఇప్పుడు వీరికి ప్రతి రోజూ 2,500 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. తమ ఉత్పత్తుల ధరలు రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయని చీను తెలిపింది. ప్రస్తుతం తమ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు చేరుకుందని తెలిపింది. అలా చీకట్లో కూడా వెలుగును పుట్టించిన చీనూ కాలా ఎందరికో ఆదర్శం. జీవితానికి అసలు అర్థం నేర్పేది.. మనకు ఎదురయ్యే కష్టాలు మాత్రమే. సుఖంగా ఉన్నప్పుడు జీవితం విలువ ఏమి తెలియదు, అదే కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే అసలు జీవితం అంటే ఏమిటి, మన గమ్యం ఏమిటో బోధపడుతుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అయితే చాలా మంది తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కుంగిపోతుంటారు. కానీ కొందరు మాత్రం కష్టాలు పెరిగే కొద్ది జీవితంలో ఉన్నత స్థితికి చేరాలనే బలమైన కోరిక మరింత పెరుగుతుంది. అలానే ఈ యువతి కూడ సొంత కుటుంబ సభ్యుల నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. నాడు కేవలం రూ.300తో రోడ్డున పడ్డ ఆమె.. నేడు వందల కోట్లకు అధిపతిగా మారింది. ఈ సక్సెస్ స్టోరీ నేటి ఎంతో మంది యువతకు ఎంతో స్ఫూర్తిధాయకం.
☛ Sridhar Vembu Success Story : రూ.28000 కోట్లకు పైగా సంపదకు అధిపతి.. నేటికి సొంత గ్రామంలో సైకిల్‌పైనే..
Tags
- Success Stories
- business ideas with low investment
- business ideas news in telugu
- business women success story
- Rs 300 To Rs 100 Crore Chinu Kala Story
- rubans chinu kala story
- rubans chinu kala story in telugu
- rubans chinu kala real life story in telugu
- rubans chinu kala real life story
- success story of rubans chinu kala
- chinu kala success story
- chinu kala success story in telugu
- Chinu Kala
- Chinu Kala Real Life Story in Telugu