Story of Successful Business Women : నెలకు కేవలం 1200 జీతం.. ప్రస్తుతం ఈ సంస్థకు అధినేత్రిగా..!
సాక్షి ఎడ్యుకేషన్: ఎంత గొప్ప కలైనా మన కృషి, పట్టుదల లేకపోతే ఎంత అనుకున్న, ఎన్ని దీవెనలున్నా అవ్వదు. ఎవ్వరైనా, ప్రతీ మెట్టును ఎక్కి గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఇలాంటి ఒక కథే ప్రస్తుతం మనం తెలుసుకునే వ్యక్తిది.
మామా ఎర్త్ గురించి వినే ఉంటారుగా.. అది ఎలా ప్రారంభమై ఇప్పుడు ఎంత పేరొంది సంస్థగా మారిందో కొత్తగా చెప్పాల్సి పని లేదు. కాని, ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి గురించి వారు పడ్డ కృషి, పట్టుదల గురించి అందరూ తెలుసుకోవాలి.
ఇది మరికొందరికి వారి కాలిపై వారు నిలిచేందుకు ఒక స్పూర్తిగా నిలుస్తుంది. ఆ వ్యక్తి.. గజల్ అలఘ్.. మామా ఎర్త్ సంస్థకు అధినేత్రి. ఈమె హర్యానాకు చెందిన మహిళ.
విద్యా జీవితం..
2013లో న్యూయార్క్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో డిజైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో సమ్మర్ ఇంటెన్సివ్, మోడరన్ ఆర్ట్‌లో ఫిగరేటివ్ ఆర్ట్‌లో ఇంటెన్సివ్ కోర్సును పూర్తి చేసింది. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనే ఆశయంతో ముందడుగు వేసింది. ఇలా, ఎదో ఒక ఉద్యోగం చేస్తూ నెలకు 1200 వేతనాన్ని దక్కించుకునేది. కొంత కాలం ఎన్ఐఐటీ లిమిటెడ్‌లో కార్పొరేట్ ట్రైనర్‌గా పని చేసింది. అక్కడే పరిచయమైన గజల్ అలఘ్ వరుణ్‌ను 2016లో పెళ్ళి చేసుకుంది.
మామా ఎర్త్ సంస్థ..
వివాహం అనంతరం, ఆమె కలను అర్థం చేసుకున్న భర్తతో కలిసి ఈ మామా ఎర్త్‌ను స్థాపించాలనుకుంది. మామా ఎర్త్ ద్వారా పిల్లలకు పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను అందించే దిశగా అడుగులు వేయసాగింది. తన వ్యక్తిగత పరిశుభ్రతకు అనుగుణంగా, అన్ని వివరాలను దృష్టిలో పెట్టుకొని, క్రీమ్స్, లోషన్స్, మసాజ్ ఆయిల్‌లు, బాడీ వాష్‌లు వంటి వివిధ ప్రడక్టులను తయారు చేసింది. ఫలితం ఎలా ఉంటుందో తెలీదు.
చేసిన ప్రాడక్టులన్నీ శరీరానికి వాడేవి. ఏ ఒక్కటి తప్పటడుగు వేసిన ఫలితం చాలా తీవ్రస్థాయికి వెళుతుందన్న విషయం తెలిసినా, చాలా కష్టపడి, ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ వీటిని విడుదల చేసారు. ఈ జంట పడ్డ కష్టానికి, వారి పట్టుదలకు అనుకున్న ఫలితం దక్కింది. ప్రస్తుతం, ఇది మార్కెట్‌లో చాలా పేరొందిన ప్రాడెక్టుగా నిలిచింది.
ఆసియాలో సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్‌గా..
గజల్ అలఘ్ ప్రస్తుతం మామా ఎర్త్ సంస్థ ద్వారా పిల్లల సంరక్షణలో ఉపయోగించే దాదాపు 500 వస్తువులను విక్రయిస్తూ.. ఆసియాలో సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్‌గా అవతరించింది. రూ. 25 లక్షలతో ప్రారంభమైన మామా ఎర్త్ సంపద ప్రస్తుతం, రూ. 9,800 కోట్లకు ఎగబాకినట్లు తెలుస్తోంది. ఇలా, ఎంతలా ఎదిగిన మహిళ ఎందరికో స్పూర్తిగా నిలిచినట్టే కదా.
Tags
- Success Story
- women inspiring story
- latest inspiring story
- mama earth founder
- Women Success Story
- inspiring story of women struggle
- women's success stories in telugu
- Ghazal Alagh success story
- Ghazal Alagh mama earth
- Mama Earth Founder Ghazal Alagh
- ghazal alagh mama earth story in telugu
- Ghazal Alagh success story in telugu
- Ghazal Alagh news in telugu
- Success and inspiring story of Ghazal Alagh
- latest success and inspiring stories of women
- latest success stories of women in telugu
- Education News
- Sakshi Education News