Skip to main content

Women IPS Officers Real Life Stories : మేము కూడా ఐపీఎస్ ఉద్యోగాలు కొట్టామిలా.. ఆ అపజయాలే... నేడు మాకు..

మ‌హిళ‌ల‌ను అన్ని రంగాల్లో పురుషుల‌తో స‌మానంగా పోటీప‌డుతున్నారు. ఇండియ‌న్ ఆర్మీ నుంచి రాష్ట్ర‌స్థాయి పోలీసు ఉద్యోగాల వ‌ర‌కు త‌ము ఏమి త‌క్కువ కాదు అని... నిరూపిస్తున్నారు. అలాగే దేశంలో యూపీఎస్సీ సివిల్స్ లాంటి క‌ఠిన‌మైన ప‌రీక్ష‌ల్లో విజయం సాధించి.. ఐఏఎస్‌, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారు.
Women IPS Officers Real Life Stories

ఎన్ని ప్రయత్నాలు చేశామన్నది కాదు... లక్ష్యం చేరామా..? లేదా..? అన్నదే ముఖ్యం అన్నట్లుగా పట్టుదలతో ఐపీఎస్‌ సాధించారు ఈ మ‌హిళ‌ ఆఫీసర్లు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం అయినా అందరి టార్గెట్‌ విమెన్‌ ఇన్‌ ఖాకీనే. ఈ నేప‌థ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించి... ఐపీఎస్ ఉద్యోగం సాధించిన‌.. మ‌హిళ ఆఫీసర్ల స‌క్సెస్ స్టోరీలు మీకోసం.. 

యూపీఎస్సీ ఐదు ప్రయత్నాల్లో విఫలయ్యా.. చివ‌రికి.. : వసుంధర యాదవ్
నా పేరు వసుంధర యాదవ్. మాది ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ఆజంగఢ్‌. నేను పెద్ద పోలీసు ఆఫీసర్‌ కావాలన్నది మా అమ్మానాన్నల కల. అది నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆరో ప్రయత్నంలో ఐపీఎస్‌ సాధించాను. 

మొదటి పోలీస్‌ అధికారిని నేనే..
నా బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో పూర్తి చేశాను. తర్వాత నుంచి సివిల్‌ సర్వీసెస్‌ కోసం ప్రిపరేషన్‌ మొదలు పెట్టాను. నాన్న వ్యాపారం చేస్తుంటారు. మా కుటుంబం నుంచి మొదటి పోలీస్‌ అధికారిని నేనే. మొదటి ఐదు ప్రయత్నాలు విఫలమైనా ఆరో ప్రయత్నంలో సక్సెస్‌ సాధించాను. 

☛ Women IPS Success Stories : యూట్యూబ్‌లో వీడియోలు చూసి యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

ఈమే నాకు...
సివిల్స్‌ క్లియర్‌ చేయాలంటే ఒక మెంటార్‌  తప్పనిసరి అని నా అభిప్రాయం . లేదంటే మార్కెట్‌లో ఉన్న మెటీరియల్‌ అంతా చదువుకుంటూ కూర్చుంటే మన శక్తి, సమయం సరిపోదు. అది వృథా  ప్రయత్నమే అవుతుంది. ఇప్పటికే సివిల్స్‌ క్లియర్‌ చేసిన వారి సూచనలతో ముందుకు వెళ్లడం ముఖ్యం. నేను ఐదుసార్లు విఫలం అయినా కూడా నా ప్రయత్నాన్ని వదలలేదు. కిరణ్‌బేడీ నాకు స్ఫూర్తి. నేను ఇప్పుడు తెలంగాణ కేడర్‌కు అలాట్‌ అయ్యాను. 

ఆమె స్ఫూర్తితోనే ఐపీఎస్ అయ్యానిలా.. : దీక్ష, ఐపీఎస్‌
నా పేరు దీక్ష. నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది. మా అమ్మ ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నాన్న ఢిల్లీలో జిల్లా విద్యాశాఖ అధికారి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. జేఎన్‌యూలో మాస్టర్స్‌ చేశాను. తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి కిరణ్‌బేడీ గురించి తెలుసుకుంటూ పెరిగాను. ఆమె స్ఫూర్తితోనే ఐపీఎస్‌ కావాలని కలలు కన్నాను. సమాజ సేవలో విమెన్‌ ఇన్‌ ఖాకీగా ఉండాలి అన్నదే నా లక్ష్యం. నా భర్త, మా అత్తమామలు, నా కుటుంబ సహకారంతోనే ఐదో ప్రయత్నంలో నా లక్ష్యాన్ని ఛేదించాను. 

☛ UPSC Civils Topper Bhawna Garg Success Story : యూపీఎస్సీ సివిల్స్‌.. ఫ‌స్ట్‌ అటెమ్ట్.. ఫ‌స్ట్ ర్యాంక్‌.. నా స‌క్సెస్‌కు..

నేను అనుకున్న దాని కోసం.. 
ఐపీఎస్‌గా సెలెక్ట్‌ కాకముందు ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌లో నాలుగేళ్లు ఢిల్లీలో పని చేశాను. 2018లో నాకు వివాహం అయ్యింది. నా భర్త  ఐఆర్‌ఎస్‌ అధికారి. ఐపీఎస్‌ కావాలన్నది నా కల. నా భర్త సహకారంతో నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చాను. ఐదో ప్రయత్నంలో సాధించాను. నాలుగు ప్రయత్నాల్లోనూ ప్రిలిమ్స్, మెయిన్స్‌ను క్లియర్‌ చేసినా నేను అనుకున్న ఐపీఎస్‌ రాలేదు. అందుకే ప్రయత్నం కొనసాగించాను. ఐపీఎస్‌ శిక్షణ అనేది నన్ను మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చింది. ఏపీ కేడర్‌కు వెళుతున్నాను. మహిళల భద్రతకు, సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తాను.

మాది  నంద్యాల... మా నాన్న‌ వ్యవసాయ చేస్తూ..: మనీశా రెడ్డి
నా పేరు మనీశా రెడ్డి. మాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల. వ్యవసాయ కుటుంబం. అమ్మా నాన్నలు పెద్దగా చదవకోయినా మా చదువుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కెరీర్‌ విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చదువుకునే సమయంలో మా నాన్నే నీకో లక్ష్యం ఉండాలమ్మా అన్నారు.  నేను ఒక మంచి పోలీస్‌ ఆఫీసర్‌ కావాలనుకున్నాను. 2020లో మొదటి అటెంప్ట్‌ చేశాను. 2022 రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ సాధించాను.  

ఇంత కఠినమైన ట్రైనింగ్‌లో...
సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అయ్యేప్పుడు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఎక్కడ మనం బలంగా ఉన్నాం, ఎక్కడ మెరుగు పర్చుకోవాలన్నది గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రిపేర్‌ కావాలి.  సీనియర్ల సూచనలు తీసుకోవడం ఉపయోగపడుతుంది. మొదటిసారి నేషనల్ పోలీస్‌ అకాడమీలో అడుగుపెట్టినప్పుడు ఇంత కఠినమైన శిక్షణ చేయగలనా అనుకున్నాను. కానీ అకాడెమీ ట్రైనింగ్‌ నాలో శక్తిని తెలుసుకునేలా చేసింది. క్రమంగా మనల్ని శిక్షణలో భాగం చేస్తారు. ఏపీ కేడర్‌కు అలాట్‌ కావడం సంతోషంగా ఉంది.  మహిళా భద్రత అనేది నా ప్రధాన లక్ష్యం. సమాజ సేవలో ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను.  

☛ Inspirational Ranker in Civils : సాధార‌ణ ఒక కానిస్టేబుల్‌.. ఎనిమిదో ప్ర‌య‌త్నంలో యూపీఎస్సీ సివిల్స్ సాధించాడిలా..

అపజయాలే.. నా విజ‌యంకు..: సోనాలి మిశ్రా
నా పేరు సోనాలి మిశ్రా. మాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లా. నా విజయంలో నా కుటుంబ సహకారం ఎంతో ఉంది. నేను రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌లో 2019లో సెలక్ట్‌ అయ్యాను. కానీ నా లక్ష్యం మాత్రం సివిల్‌ సర్వీసెస్‌. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా నిరాశ చెందలేదు. ఐదోసారి ఐపీఎస్‌ సాధించాను. నా కుటుంబంలో నేనే మొదటి ఐపీఎస్‌ అధికారిని. ఔట్‌డోర్‌ శిక్షణలో 15 కిలోల బరువుతో 40 కిలోమీటర్లు నడవడం వంటి ఎన్నో కఠిన శిక్షణల తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. న‌న్ను యూపీ కేడర్‌కు అలాట్‌ అయ్యాను. 

కొన్నిసార్లు మీ ప్రయత్నంలో..
నీపై నీకు విశ్వాసం ఉంటే ప్రయత్న లోపం లేకుండా సాధన చేస్తే కాలం కూడా కలిసి వస్తుందని నమ్ముతాను. అపజయాలనేవి మనల్ని నిర్వచించలేవు. కొన్నిసార్లు మీ ప్రయత్నంలో లోపం లేకున్నా ఏదో ఒక చిన్న తప్పుతో విజయం రాక‌పోవచ్చు. అంత మాత్రాన నిరాశ చెందాల్సిన పని లేదు.

☛ Women's IPS Success Story : పెళ్లి తర్వాత కూడా ఐపీఎస్ కొట్టారిలా.. ఇప్పుడంతా వీళ్ల‌దే హ‌వా..

Published date : 20 Sep 2024 11:35AM

Photo Stories