Skip to main content

Inspirational Ranker in Civils : సాధార‌ణ ఒక కానిస్టేబుల్‌.. ఎనిమిదో ప్ర‌య‌త్నంలో యూపీఎస్సీ సివిల్స్ సాధించాడిలా..

ఒక‌టి, రెండు కాదు త‌న స‌హ‌నం, ప‌ట్టుద‌ల‌తో ఏడు సార్లు సివిల్స్ ప‌రీక్ష‌లు రాసారు ఢిల్లీ పోలీస్ శాఖ‌లో ప‌ని చేస్తున్న రామ్‌భజన్‌ కుమార్‌. కాని, విఫ‌లం అవ్వ‌డంతో మ‌ళ్ళీ ఎనిమిదో ప్ర‌య‌త్నం చేశాడు. ఫ‌లితాన్ని ద‌క్కించుకున్నాడు. అలా.. ఇత‌ని స‌హ‌నం, ప్ర‌య‌త్నాలు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచాయి. ఇత‌ను పొందిన విజయం గురించి త‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం..
Ram Bhajan.. the civils ranker at his eighth trial, Inspiring Success Story, Dedication to Achieving Goals Eighth Attempt Success,
Ram Bhajan.. the civils ranker at his eighth trial

ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌భజన్‌ కుమార్‌ సివిల్స్‌లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్‌ సెల్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్‌ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్‌భజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

➤   Dream Success Journey: చిన్న‌త‌నంలో ఎంచుకున్న ల‌క్ష్యాన్ని సాధించిన యువ‌కుడు..

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్‌ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్‌భజన్‌కు తొమ్మిది సార్లు సివిల్స్‌ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు.

➤   Civil SI Achievement: ఎస్ఐగా కొలువు కొట్టిన సెక్యూరిటీ కూతురు..

ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు.

➤   Constable to SI Posts: మొన్న‌టివ‌ర‌కు కానిస్టేబుల్లు.. ఇప్పుడు ఎస్ఐగా విధులు

ఒకవేళ ఈసారి కూడా సివిల్స్‌ ఉత్తీర్ణత కాకుంటే..

Ram Bhajan upsc rank success story in telugu


సివిల్స్ సాధించాలన్న తన కల ఇప్పటికి నిజమైందని, అయితే ర్యాంకును మెరుగుపరుచుకునేందుకు ఇంకోసారి ప్రయత్నిస్తానని రామ్ భజన్ కుమార్ తెలిపారు. నేను కన్న కలలు నిజమయ్యాయి. ఇది నా ఎనిమిదో ప్రయత్నం. నేను ఓబీసీ కేటగిరీకి చెందినందున నాకు తొమ్మిదిసార్లు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది నా రెండో లాస్ట్ ఛాన్స్. ఒకవేళ ఈసారి కూడా యూపీఎస్సీ పరీక్షలో నేను ఉత్తీర్ణత సాధించకపోయి ఉంటే.. మళ్లీ ప్రయత్నించే వాడిని. అలాగే నా సివిల్స్‌ ర్యాంక్‍ను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతోనే మే 28న జరిగిని సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు కూడా హాజ‌రైయ్యాను. 34 ఏళ్ల రామ్ భజన్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‍లో హెడ్ కానిస్టేబుల్‍గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రతీరోజు 16 గంటలు పాటు..
నేను ప్రతీ రోజు ఆరు గంటల పాటు చదివేవాడిని. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ నుంచి యూపీఎస్సీ(UPSC) మెటీరియల్ తెచ్చుకున్నాను. పరీక్షల తేదీలు దగ్గర పడే సమయంలో నెల రోజులు సెలవు తీసుకొని ప్రతీ రోజు 16 గంటల వరకు చదివేవాడిని. 2019లో UPSC సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించి ఏసీపీ అయిన కానిస్టేబుల్ ఫిరోజ్ ఆలమ్ తనకు స్ఫూర్తి అని రామ్ భజన్ కుమార్ చెప్పారు. 

ఆలమ్ సర్ ర్యాంక్ సాధించాక.. మరింత కష్టపడేందుకు నాకు స్ఫూర్తి వచ్చింది. UPSC సివిల్స్‌ కోసం ప్రిపేర్ అవుతున్న నా లాంటి చాలా మంది కోసం ఆయన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చి.. ప్రోత్సాహించారు. నేను 2009 నుంచి పోలీసు శాఖలో పని చేస్తున్నాను.

నా భార్య రెండేళ్లుగా..
తాను ఓడిపోతున్నా.. రెండేళ్లుగా తన భార్య ప్రోత్సహించి.. సపోర్టుగా నిలిచిందని రామ్ భజన్ కుమార్ చెప్పారు. నేను రాజస్థాన్‍లోని ఓ గ్రామం నుంచి వచ్చా. మా తండ్రి కూలీగా పని చేస్తున్నారు. మమ్మల్ని చదివించేందుకు.., పోషించేందుకు మా కుటుంబం ఎంత కష్టపడిందో నేను చూశా. మేం ఎప్పుడు ఆశను కోల్పోలేదు. నాకు అవకాశం దక్కినప్పుడు.. నేను కష్టపడాలని నిర్ణయించుకున్నాను.

Published date : 24 Oct 2023 05:31PM

Photo Stories