Civil SI Achievement: ఎస్ఐగా కొలువు కొట్టిన సెక్యూరిటీ కూతురు..
పేదరికాన్ని లెక్క చేయని యువతి కష్టపడి ఉన్నత కొలువును సాధించింది. లక్ష్య సాధనకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది. ఇటీవల విడుదలైన ఎస్‌ఐ ఫలితాల్లో తాండూరు పట్టణం పసారీ వార్డుకు చెందిన వీరేశం, నిర్మల దంపతుల కూతురు దూది కావేరి ఎస్సై (సివిల్) ఉద్యోగం సాధించింది.
➤ Dream Success Journey: చిన్నతనంలో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించిన యువకుడు..
తండ్రి పట్టణ శివారులోని ఓ స్పిన్నింగ్ మిల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచి చదువుపై మక్కువ చూపే కావేరి పదో తరగతి స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్, ఇంటర్మీడియెట్ తాండూరు చైతన్య కళాశాలలో, డిగ్రీ ఓపెన్‌లో చదివింది.
డీఎడ్ చదివి డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఆమె.. హైదరాబాద్‌లో ఎస్సై పరీక్ష కోసం శిక్షణ తీసుకుంది. పట్టుదలతో ఎస్సై కొలువు సాధించింది. దీంతో కావేరిని కుటుంబసభ్యులు, స్నేహితులు అభినందనలతో ముంచెత్తారు.