Skip to main content

Young Woman Success: పెద్ద కంపెనీల ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రించిన యువ‌తి.. ఇప్పుడు ఏడాదికి 20 ల‌క్ష‌ల సంపాద‌న‌.. ఎలా?

త‌న చ‌దువు స‌మ‌యంలోనే వ‌చ్చిన ప‌లు జాబ్ ఆఫ‌ర్లు చాలా పెద్ద కంపెనీల‌వే. వారు అందిస్తామ‌న్న వేత‌నం కూడా ఎక్కువే. వ‌చ్చింది ఒకటి రెండు ఆఫ‌ర్లు కాదు, ఏకంగా 13 కంపెనీల‌నుండి వ‌చ్చిన ఆఫ‌ర్లు. ఇంత‌కీ ఆమె ఈ ఆఫ‌ర్ల‌ను ఎందుకు తిరస్క‌రించింది? ఇంత‌కీ ఆమె జాబ్ ఇందులో సాధించింది? ఈ విష‌యాల్ని ఈ యువ‌తి మాట‌ల్లోనే తెలుసుకుందాం..
21 Years old Riti Kumari.. achieves a great offer
21 Years old Riti Kumari.. achieves a great offer

కోవిడ్‌ -19, లేఆఫ్స్‌ వంటి కఠిన సమయాల్లో మీకొక జాబ్‌ ఆఫర్‌ వస్తే ?ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానిస్తే. అందులో టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌లాంటి సంస్థలుంటే! ఏం చేస్తారు? ఏం కంపెనీలో చేరాలో నిర్ణయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ టెక్కీ వచ్చిన ఆఫర్స్‌ అన్నింటిని తిరస్కరించింది. అందుకు కార‌ణం.. ఈ కింది క‌థ‌నం చ‌దివండి..

➤   Youth Success as SI: మొట్ట‌మొద‌టి ప్ర‌య‌త్నంలోనే గెలుపొందిన యువ‌తీయువ‌కులు

ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరుకు చెందిన రితి కుమారి (21). ఇప్పటి వరకు 13 కంపెనీల నుంచి ఆఫర్స్‌ వచ్చాయి. జీతం కూడా ఏడాదికి రూ.17 లక్షలు పైమాటే. 

ఇంత శాలరీ వస్తుంటే ఎవరు కాదంటారు? చెప్పండి. కానీ రితి మాత్రం వద్దనుకుంది. తన మనసుకు నచ్చిన జాబ్‌ చేయాలని భావించింది. బదులుగా వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు మొగ్గుచూపానంటూ జీవితంలో ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ తనకు ఎదురైన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. అన్నట్లు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన ఆమె ఏడాదికి రూ. 20 లక్షల వేతనం తీసుకుంటున్నారు.

➤  SI Success: అప‌జ‌యాన్ని విజ‌యంగా మార్చుకున్న యువ‌కుడు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు వచ్చిన జాబ్‌ ఆఫర్‌లు మంచివే. అందులో ఏదో ఒకటి సెలక్ట్‌  చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ సోదరి ప్రేరణతో అన్నీ ఉద్యోగాల్ని కాదనుకున్నాను. మనసు మాట విని చివరికి వాల్‌మార్ట్‌ని ఎంచుకున్నాను. 6 నెలల ఇంటర్న్‌షిప్‌లో నెలకు స్టైఫండ్‌ రూ.85,000 సంపాదించాను. నేను వాల్‌మార్ట్ ఇంటర్న్‌షిప్ ఆఫర్‌ను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నాను.

➤  SI Post Achievers: ఎస్ఐగా కొలువు సాధించిన ఇద్ద‌రు యువ‌కులు

నా కొచ్చిన జాబ్‌ ఆఫర్స్‌లో పొందే నెలవారీ వేతనం కంటే వాల్ మార్ట్‌ ఇచ్చే జీతం చాలా తక్కువ .ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కఠినమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక ఆందోళన చెందా. ఎవరూ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అప్పుడే నా సోదరి ప్రీతి కుమారి ఓ మాట చెప్పింది. ముందు నువ్వు నీ మనసు మాట విను. అది ఏం చెబితే అదే చేయి అంటూ ప్రోత్సహించింది. 

job offer

ప్రస్తుతం, ధన్‌బాద్‌లోని ఐఐటీలో పీహెచ్‌డీ చదువుతున్న నా సోదరి ప్రీతి కుమారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన జాబ్‌ ఆఫర్స్‌ను తిరస్కరించింది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు.

➤   APPSC Group 1 Ranker : గ్రూప్‌-1, 2 రెండు ఉద్యోగాలు కొట్టానిలా..

కాబట్టే, నేను వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ ఆఫర్ తీసుకున్నాను.కష్టపడి ప్లేస్‌మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. చివరికి వాల్‌మార్ట్ నుండి జాబ్ ఆఫర్ పొందాను అని కుమారి చెప్పారు. ఇప్పుడు తన కెరీర్‌ విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్న తన తండ్రిని సహచర ఉపాధ్యాయులు సైతం అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు.

➤   Sakshi Education Space Contests 2023 Winners: ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల పోటీల‌కు అపూర్వ స్పంద‌న‌.. విజేత‌లు వీరే..

రితి లింక్డిన్‌ ప్రొఫైల్ ప్రకారం.. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్‌మార్ట్‌లో ట్రైనింగ్‌ తీసుకుంది. ఆపై వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ -2గా చేరింది.

Published date : 22 Oct 2023 11:50AM

Photo Stories