SI Success: అపజయాన్ని విజయంగా మార్చుకున్న యువకుడు..
సిరిసిల్ల ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పిట్ల దీపక్ పాఠశాలలో చదివే వయసు నుంచి అన్నింట్లో ముందుండేవాడు. ఈ యువకుడి తల్లి గృహిణి కాగా తండ్రి శ్రీశైలం టీవీ మెకానిక్.
☛ SI Success Story: ఎస్ఐగా ఎంపికైన యువతీ
మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఇతను, తాను ఆశించినట్లుగానే ఎస్ఐ కొలువు కోసం ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. ఈ ప్రయాణంలోనే తన మొదటి ప్రయత్నం చేశాడు. ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించగా ఒక్క మార్కుతో జాబ్ రాలేకపోయింది. ఏ ఫలితాన్ని ఇవ్వలేదు.
☛ Dream Successful: చిన్నప్పటి కలను సాకారం చేసుకున్న యువకుడు
కాని, ఏ మాత్రం నిరాశ చెందలేదు. అందులో జరిగిన తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. రెండోసారి శ్రద్ధగా చదివాడు, తన పట్టుదలను వీడలేదు. ఇలా రెండో ప్రయత్నంలో పరీక్షను పూర్తి చేయగా సివిల్ ఎస్సైగా ఎంపికయ్యాడు.
☛ Success Achievement: ఉద్యోగానికి సెలవు.. ఎస్ఐగా ఎంపిక
సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిన్నబాబాయి శంకర్ ప్రోత్సాహంతోనే పోలీస్ డిపార్ట్‌మెంట్ వైపు అడుగులు వేసినట్లు దీపక్ తెలిపారు. తను కొలువును సాధించడంతో తన తల్లిదండ్రులతో పాటు తనకు ప్రోత్సాహాన్ని అందించిన తన చిన్నబాబాయి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.