Skip to main content

Dream Successful: చిన్న‌ప్ప‌టి క‌ల‌ను సాకారం చేసుకున్న యువ‌కుడు

అన్ని క‌ల‌లు నెర‌వేర‌వంటారు కాని, ప‌ట్టుద‌ల కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేద‌ని ఈ నిరుపేద యువ‌కుడు. ఇత‌ను త‌న చిన్నత‌నంలో కన్న క‌ల పోలీస్ అధికారి కావాల‌ని. ఆ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు త‌న కృషి ప‌ట్టుద‌ల‌తో పాటు త‌న త‌ల్లిదండ్రుల స‌హ‌కారం కూడా తోడైందుకు త‌న హ‌ర్షం వ్య‌క్తం చేశాడు..
Hardworking young police officer, Police job successor Vinod with his parents,"Parents' support and hard work
Police job successor Vinod with his parents

చిన్ననాటి నుంచి పోలీస్‌ యూనిఫాం వేసుకోవాలనే కల సాకారం చేసుకున్నాడు నిరుపేద దళిత యువకుడు జోగు వినోద్‌. బల్వంతాపూర్‌ గ్రామానికి చెందిన జోగు రాజయ్య–మణెమ్మ పెద్ద కుమారుడు వినోద్‌ రెండో ప్రయత్నంలో ఆర్‌ఎస్సై ఉద్యోగం సాధించాడు. వినోద్‌ బల్వంతాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియేట్‌, డిగ్రీ జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాలలో పూర్తిచేశాడు. కరీంనగర్‌ కిమ్స్‌లో ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ పూర్తిచేశాడు. పదో తరగతి నుంచే పోలీస్‌ కావాలనే సంకల్పంతో చదివారు.

Success Journey of Young Man: ఏడో ప్ర‌య‌త్నంలో సాధించిన ర్యాంకు

ఓసారి ఎస్సై పరీక్ష రాసి మూడు మార్కుల తేడాతో ఉద్యోగం సాధించలేకపోయాడు. రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి చేయూతనందిస్తానన్నాడు. పోలీస్‌ కావాలనే కల సాకారం కావడానికి అమ్మానాన్న, తమ్ముడి సహకారం ఎంతో దోహదం చేసిందని చెప్పాడు. సమాజమే నా కుటుంబంగా భావించి, ఉద్యోగం చేస్తూ, ప్రజల కష్టాలను తీర్చడంతో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు.

Published date : 20 Oct 2023 03:17PM

Photo Stories