SI Success Story: ఎస్ఐగా ఎంపికైన యువతీ
![Manisha from Bahilampur selected as SI](/sites/default/files/images/2023/10/10/manisha-si-1696935352.jpg)
మండల పరిధిలోని బహిలంపూర్ గ్రామానికి చెందిన దుంబాల కృష్ణారెడ్డి నాగమణి కూతురు మనీషా రెడ్డి ఎస్స్సై ఉద్యోగం సాధించింది. మనీషా తన కోరిక మెరకు ఎస్ఐ పరీక్షలకు సిద్ధమై, పట్టుదలతో పాటు తమ తల్లిదండ్రుల సహకారంతో పరీక్షలను పూర్తి చేసింది. ఫలితాలనుసారం ఆమె మంచి ఫలితాలతో విజయం పొందింది.
SI Success Story: ఎస్ఐగా విజయం..
ఈ నేపథ్యంలోనే, బహిలింపూర్ సర్పంచ్ నేర్లపల్లి స్వాతి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. మనిషా ఎంతో కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగం సాధించిందని, ఆమె విజయం ఊరందరికీ గర్వకారణం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆమె ఉద్యోగంలో చేరి, అక్కడ శ్రమించి, తన పని, పట్లుదలతో ఊరికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
తమ కూతురు సాధించిన విజయంపై ఆమె తల్లిదండ్రలు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనీషాను సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు కలిసి సన్మానించారు.