SI Success Story: ఎస్ఐగా విజయం..
ఆదివారం వెలువడిన తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాల్లో మండంలోని కమలాపురంకు చెందిన తాటికొండ సాయి శశాంక్ సివిల్ ఎస్సైగా ఎంపిక అయ్యారు. కమలాపురం గ్రామంలో డిష్ ఆపరేటర్ గా పని చేస్తున తాటికొండ మాదవచారి, హరిప్రియల కుమారుడు సాయి శశాంక్ 1 నుండి 10వ తరగతి వరకు గ్రామంలోని తాపర్ విద్యావిహార్ హైస్కూల్ లో చదివి ఉన్నత చదువుల నిమిత్తం హైద్రాబాద్ మీర్ పేటలోని తీగల కృష్ణరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎస్సై పోస్టులకు ప్రిపేర్ అయినట్లు తెలిపారు.
Drone Pilot: 18 ఏళ్లకే డ్రోన్ పైలట్ అయ్యా... నా సక్సెస్ జర్నీ సాగిందిలా..!
శనివారం వెలువడిన ఎస్సై ఫలితాల్లో కాళేశ్వరం జోన్ -1 నుండి ఓపెన్ కటాఫ్ లో 400/272 మార్కులతో సాయి శశాంక్ ఎస్సై పోస్టుకు సెలెక్టు కావడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ సాదారణ డిష్ ఆపరేటర్ గా జీవితం గడుతుపుతున్న మాదవచారి హరిప్రియల కుమారుడు ఎస్సైగా ఎంపిక కావడం పట్ల ఆ కుటుంబంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి…