Skip to main content

Drone Pilot: 18 ఏళ్ల‌కే డ్రోన్ పైల‌ట్ అయ్యా... నా స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

ఇటీవ‌ల డ్రోన్ క‌ల్చ‌ర్ విప‌రీతంగా పెరిగిపోయింది. పెళ్లిళ్లు, శుభ‌కార్య‌క్ర‌మాలు, సినిమా షూటింగ్‌లు, పొలిటిక‌ల్ మీటింగ్‌లు... ఇలా కార్య‌క్ర‌మం ఏదైనా అక్క‌డ డ్రోన్ ఉండాల్సిందే. అయితే డ్రోన్ ఆప‌రేట‌ర్‌గా మ‌న‌కు ఎక్కువ‌గా అబ్బాయిలే క‌నిపిస్తుంటారు.
Drone Pilot
18 ఏళ్ల‌కే డ్రోన్ పైల‌ట్ అయ్యా... నా స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

అన్ని రంగాల్లో అబ్బాయిల‌తో పోటీ ప‌డుతున్న అమ్మాయిలు... డ్రోన్ ఆప‌రేటింగ్ చేయ‌డంలోనూ పోటీ ప‌డుతున్నారు. కేర‌ళ‌కు చెందిన ఓ 18ఏళ్ల అమ్మాయి డ్రోన్ పైల‌ట్ లైసెన్స్ పొందిన తొలి అమ్మాయిగా రికార్డుల‌కెక్కింది. ఈ వివ‌రాలు ఇలా ఉన్నాయి...

చ‌దవండి: దేశంలో 2.50 ల‌క్ష‌ల రైల్వే ఉద్యోగాల ఖాళీ.... రిక్రూట్‌మెంట్ ఎప్పుడంటే..?

కేరళలోని మలప్పురానికి చెందిన రిన్ష పట్టకకు గాలిలో ఎగురుతున్న డ్రోన్‌లను చూడడం అంటే సరదా. ఆ సరదా కాస్తా ఆసక్తిగా మారింది. డ్రోన్‌లకు సంబంధించిన ఎన్నో విషయాలను సివిల్‌ ఇంజనీర్‌ అయిన తండ్రి అబ్దుల్‌ రజాక్‌ను అడిగి తెలుసుకునేది. ప్లస్‌ టు పూర్తయిన తరువాత బీటెక్‌ అడ్మిషన్‌ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లో విరామ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తుప్పుడు రిన్షకు తట్టిన ఐడియా డ్రోన్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ కోర్సు. తండ్రితో చెబితే ఆయన ‘బాగుంటుంది’ అని ఓకే చెప్పి ప్రోత్సహించాడు.

drone pilot

చ‌దవండి: వ‌ర్క్ ఫ్రం హోంకు బైబై.. ఆఫీస్‌కు రాని వారిని తొల‌గించాల‌ని నిర్ణ‌యం... 10 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం..!

శిక్షణ కోసం కాసర్‌గోడ్‌లోని ఏఎస్‌ఏపీ కేరళ కమ్యూనిటీ స్కిల్‌ పార్క్‌లో చేరింది. క్లాసులో తాను ఒక్కతే అమ్మాయి! ఈ స్కిల్‌పార్క్‌లో యువతరం కోసం ఆటోమోటివ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, హాస్పిటాలిటీ, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఎన్నో వొకేషనల్‌కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్‌ ఫ్లయింగ్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉంది. కోర్సులో భాగంగా బేసిక్‌ ఫ్లైట్‌ ప్రిన్సిపల్స్‌ నుంచి డ్రోన్‌ ఫ్లయింగ్‌ రూల్స్‌ వరకు ఎన్నో నేర్చుకుంది రిన్ష.

ఏరియల్‌ సర్వైలెన్స్, రెస్క్యూ ఆపరేషన్స్, అగ్రికల్చర్, ట్రాఫిక్, వెదర్‌ మానిటరింగ్, ఫైర్‌ ఫైటింగ్‌లతోపాటు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డెలివరీ సర్వీస్‌... మొదలైన వాటిలో డ్రోన్‌లకు ప్రాధాన్యత పెరుగుతోంది. మన దేశంలో డ్రోన్స్‌ ఆపరేట్‌ చేయడానికి డీజీసీఏ డ్రోన్‌ రిమోట్‌ పైలట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి.

చ‌దవండి: కోటి రూపాయ‌ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన ఐఐఐటీ అమ్మాయి... 

డీజీసీఏ లైసెన్స్‌ పొందిన కేరళ తొలి మహిళా డ్రోన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిన రిన్ష ఇలా అంటోంది... ‘రెస్క్యూ ఆపరేషన్స్‌ నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు ఎన్నో రంగాలలో డ్రోన్‌లు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. డీజీసీఏ డ్రోన్‌ రిమోట్‌ పైలట్‌ సర్టిఫికెట్‌ అందుకున్నందుకు గర్వంగా ఉంది’ ‘రిన్ష విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు స్కిల్‌పార్క్‌ ఉన్నతాధికారులు. 

Published date : 10 Aug 2023 10:53AM

Photo Stories