Skip to main content

Food Safety: తెలంగాణలో వెనుకబడిన ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ

తెలంగాణ రాష్ట్రం ప్రజారోగ్యంతో సంబంధించి ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో వెనకబడింది.
Telangana lags way behind in enforcing food safety laws

2023-24 సంవత్సరానికి సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన భారతదేశ ఆహారభద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అందించిన నివేదికలో, రాష్ట్రం అనేక అంశాల్లో వెనకబడి ఉందని వెల్లడించింది.

మార్కుల ప్రాతిపదిక: తెలంగాణ 100 మార్కులకు 35.75 మార్కులు పొంది 23వ స్థానంలో ఉండ‌గా.., కేరళ అగ్రస్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో ఉంది.

సహాయ కేంద్రాలు: మానవ వనరుల ప్రమాణాల్లో కూడా రాష్ట్రం వెనకబడింది. జనాభాకు తగిన పద్ధతిలో ఆహార నాణ్యత తనిఖీ ఉద్యోగులు, సిబ్బంది తక్కువగా ఉండటం, రాష్ట్రస్థాయి సలహా కమిటీ ఏర్పాటులో కష్టతరంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

లైసెన్స్‌లు: రాష్ట్రం లైసెన్స్‌ల జారీ, క్యాంపుల నిర్వహణ, నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం వంటి అంశాలలో వెనకబడి ఉంది. ఆహార నాణ్యత తనిఖీ ప్రయోగశాలలు, ఎన్ఏబీఎల్ గుర్తింపు ఉన్న రాష్ట్ర ల్యాబొరేటరీలు, మరియు మౌలిక సదుపాయాలు కూడా పరిమితంగా ఉన్నట్లు వెల్లడైంది.

Rice Producing: వరి దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ

కేరళ విజయాలు..
కేరళ రాష్ట్రం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, కొత్త ఆహార విక్రయ కేంద్రాల లైసెన్స్‌ల సంఖ్యను పెంచింది. 2023-24 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాల్లో వందశాతం తనిఖీలు నిర్వహించారు.

మౌలిక సదుపాయాలు: తనిఖీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు, ప్రయోగశాలలకు ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందించారు.
అత్యాధునిక పరికరాలు: నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయడానికి అవసరమైన అత్యాధునిక యంత్రపరికరాలతో కూడిన వాహనాలను ప్రతి జిల్లాలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఉద్యోగ శిక్షణ: ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇచ్చి వినియోగదారుల సాధికారతను ప్రోత్సహించారు. ‘నాణ్యమైన ఆహారం’ అనే అంశంపై వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గతంకంటే ర్యాంకును మెరుగుపరచుకోవడంలో కేరళ విజయం సాధించింది.

Asia Power Index: శక్తిమంతంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్‌కు మూడో స్థానం

Published date : 01 Oct 2024 10:45AM

Photo Stories