Skip to main content

Asia Power Index: ఆసియా పవర్‌ ఇండెక్స్‌లో భారత్‌కు మూడో స్థానం.. మొద‌టి దేశం ఇదే..

ఆస్ట్రేలియాకు చెందిన లోవీ సంస్థ విడుదల చేసిన వార్షిక ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
India Ranks Third in Annual Asia Power Index   India ranked third in Asia Power Index 2024  India surpasses Japan in economic growth

ఆసియాలో అత్యంత ప్రభావం చూపుతూ.. శక్తిమంతంగా ఎదుగుతున్న ప్రపంచ దేశాల్లో భార‌త్ మూడో స్థానానికి చేరుకుంది. ఈ ర్యాంకింగ్‌లో భారత్‌ తన ఆర్థిక వృద్ధితో జపాన్‌ను అధిగమించింది.

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రభావం చూపే ప్రపంచ దేశాల ఆధారంగా.. లోవీ ఇనిస్టిట్యూట్‌ 2018లో ఆసియా పవర్‌ ఇండెక్స్‌ను ప్రారంభించింది. 

సిడ్నీ కేంద్రంగా ఉన్న లోవీ సంస్థ ప్రకారం.. ఈ జాబితాలో అమెరికా(81.7 స్కోర్‌), చైనా(72.7), భారత్‌(39.1), జపాన్‌(38.9), ఆస్ట్రేలియా(31.9), రష్యా(31.1) వ‌రుస‌గా ఆరు స్థానాల్లో నిలుచున్నాయి.

ఆర్థిక వృద్ధి, భవిష్యత్‌ సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం భారత్‌ ఎదుగుదలకు కీలకమైన అంశాలుగా లోవీ సంస్థ పేర్కొంది. ‘కొవిడ్‌ మహమ్మారి తర్వాత భారత్‌ అద్భుతంగా పుంజుకుంది. దేశ ఆర్థిక సామర్థ్యం 4.2 పాయింట్ల మేర పెరిగింది. బలమైన జీడీపీ వృద్ధి, అధిక జనాభా వంటి అంశాలు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ స్థానాన్ని బలపరుస్తాయి’ అని లోవీ సంస్థ తెలిపింది.

Third Largest Economy: మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్‌!

Published date : 27 Sep 2024 01:13PM

Photo Stories