Skip to main content

Rice Producing: వరి దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ

దేశంలోని ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది.
Telangana Largest Rice Producing State in India

2023-24 సంవత్సరంలో వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం 168.74 లక్షల టన్నుల వరి దిగుబడిని సాధించింది, ఇది గత ఐదేళ్లలో సాధించిన అత్యధికం. ఉత్తర్‌ప్రదేశ్ (159.90 లక్షల టన్నులు), పశ్చిమబెంగాల్ (156.87), పంజాబ్ (143.56), ఛత్తీస్‌గఢ్ (97.03) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తుది అంచనాల ప్రకారం, 2023-24లో దేశవ్యాప్తంగా 3,322.98 లక్షల టన్నుల దిగుబడి నమోదైంది, ఇది 2022-23 తో పోలిస్తే 26.11 లక్షల టన్నుల అధికం.

దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో కరవుల పరిస్థితులు, రాజస్థాన్‌లో సుదీర్ఘ వర్షాభావం పప్పు, సోయాబీన్, పత్తి వంటి పంటలకు ప్రభావం చూపినట్లు కేంద్రం పేర్కొంది.

తెలంగాణ.. పత్తి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడులో కూడా మంచి స్థానం సాధించింది.

  • పత్తి: 50.80 లక్షల బేళ్లు
  • మొక్కజొన్న: 27.79 లక్షల టన్నులు
  • చిరుధాన్యాలు: 199.15 లక్షల టన్నులు
  • పొద్దుతిరుగుడు: 0.15 లక్షల టన్నులు

ఆంధ్రప్రదేశ్‌లో..

  • వరి: 73.42 లక్షల టన్నులు (గత ఐదేళ్లలో అతి తక్కువ)
  • మినుము: 3.45 లక్షల టన్నులు
  • ఆముదం: 0.25 లక్షల టన్నులు
  • జొన్న: 3.29 లక్షల టన్నులు
  • వేరుసెనగ: 3.23 లక్షల టన్నులు
  • పొగాకు: 2 లక్షల టన్నులు

Floods: వరద ముంపులో.. అగ్ర స్థానంలో ఉన్న‌ బీహార్.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ!!

Published date : 27 Sep 2024 03:38PM

Photo Stories