Skip to main content

FIFA World Cup: సౌదీ అరేబియాలో 2034 ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్

పుష్కర కాలం వ్యవధిలో ఆసియాలోని మరో అరబ్‌ దేశం ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతుంది.
Saudi Arabia to host FIFA World Cup in 2034

2022లో ఖతర్‌లో ఈ మెగా ఈవెంట్‌ జరగ్గా.. ఇప్పుడు సౌదీ అరేబియా ఆ అవకాశం దక్కించుకుంది. 2034లో జరిగే ప్రపంచ కప్‌ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) అధికారికంగా ప్రకటించింది. 

2034 వరల్డ్‌ కప్‌ కోసం ఒక్క సౌదీ మాత్రమే బిడ్‌ వేసింది. గత 15 నెలలుగా బిడ్డింగ్‌ ప్రక్రియ కొనసాగింది. మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఆ దేశానికే ఆతిథ్య హక్కులు గతంలోనే ఖాయమయ్యాయి. అయితే ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో నేతృత్వంలో బుధవారం 200 మంది ‘ఫిఫా’ సభ్యులు ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమై దీనికి ఆమోద ముద్ర వేశారు. 

ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా

ఖతర్‌ తరహాలోనే ఈ దేశంలోనూ మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని, వరల్డ్‌ కప్‌ అవకాశం ఇవ్వరాదని విమర్శలు వచ్చినా.. ‘ఫిఫా’ వీటిని లెక్క చేయకుండా ముందుకు సాగింది. దేశ రాజధాని రియాద్‌తో పాటు ఇంకా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించని కొత్త నగరం ‘నియోమ్‌’లో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.  

మూడు దేశాల్లో 2030 టోర్నీ.. 
‘ఫిఫా’ సమావేశంలో 2030 వరల్డ్‌ కప్‌ ఆతిథ్య హక్కులను కూడా ఖాయం చేశారు. ఈ టోర్నీని యూరోప్‌ దేశాలు స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఆఫ్రికా దేశం మొరాకో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీంతో పాటు 1930లో జరిగిన తొలి వరల్డ్‌ కప్‌కు వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని దక్షిణ అమెరికాలోని మూడు దేశాల్లో తొలి మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. 

National Championship: జార్ఖండ్‌.. జాతీయ సబ్‌ జూనియర్‌ మహిళల హాకీ విజేత

Published date : 12 Dec 2024 07:14PM

Photo Stories