National Award: చిల్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ పురస్కారం
Sakshi Education
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ పంచాయతీ పురస్కారం-2024 లభించింది.
ఈ పురస్కారాన్ని డిసెంబర్ 11వ తేదీ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రివర్గం మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అందజేశారు.
ఈ అవార్డును పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, చిల్లపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రామకృష్ణ స్వీకరించారు. పురస్కారంతోపాటు రూ.75 లక్షల నగదు పారితోషికం అందుకున్నారు. చిల్లపల్లి గ్రామం మహిళా మిత్ర కేటగిరీలో రెండో స్థానాన్ని సాధించింది.
గ్రామసభల్లో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొనడం, మహిళా పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు ఈ గ్రామం జాతీయ అవార్డును పొందింది.
Published date : 12 Dec 2024 06:54PM