Skip to main content

Floods: వరద ముంపులో.. అగ్ర స్థానంలో ఉన్న‌ బీహార్.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ!!

భార‌త‌దేశంలో వరదలు, తుపాన్ల వల్ల ముంపునకు గురవుతున్న రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో నిలిచింది.
National Remote Sensing Center satellite   Bihar is Indias most Floods state, AP Fifth Place  National Disaster Management Authority

దక్షిణాది రాష్ట్రాల్లో ఏకంగా మొదటి స్థానంలో నిలిచిందని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ వెల్లడించింది. 1998 నుంచి 2022 వరకు వివిధ రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, తుపాన్ల వల్ల జరిగిన నష్టాలను తెలియజేసింది. 

దేశంలో అత్యధికంగా బీహార్‌ రాష్ట్రంలో 39 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 26 లక్షల హెక్టార్లు, అస్సాంలో 24 లక్షల హెక్టార్లు, పశ్చిమబెంగాల్‌లో 19 లక్షల హెక్టార్లు, ఒడిశాలో 14 లక్షల హెక్టార్లు, ఏపీలో 8 లక్షల హెక్టార్లలోని ప్రాంతాలు తుపాన్లు, వరదల వల్ల నీటమునిగాయని వెల్లడించింది. ఏపీలో అయితే బాపట్ల, నెల్లూరు జిల్లాలే అత్యధికంగా నీట మునిగాయని తెలిపింది. నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 1.11 లక్షల హెక్టార్ల భూమి ముంపునకు గురైందని పేర్కొంది. 

Cyclones: ఆయాదేశాల‌తో సంబంధం ఉన్న తుఫాన్ల పేర్లు ఇవే..

ఈ నదులపై తీవ్ర ప్రభావం
ఎడతెగని వర్షాలతో పాటు ఆక్రమణలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వీర్యం, ప్రతికూల వాతావరణం, మా­రు­తున్న భూ వినియోగ విధానాలు, పెరుగుతున్న జనాభా తదితరాల వల్లే వరదలు సంభవిస్తున్నాయని తెలిపింది. గడిచిన 25 ఏళ్లలో భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో ప్రవాహం పెరిగి.. తరుచూ వరదలు సంభవిస్తున్నాయని పేర్కొంది. రుతుపవనాలు, అల్పపీడనాలు కూడా ఏపీలో వరదలకు దోహదం చేస్తున్నాయని తె­లిపింది.

తీవ్ర విషాదం మిగిల్చిన దివిసీమ ఉప్పెన
1977లో సంభవించిన దివిసీమ(కృష్ణాజిల్లా) ఉప్పెన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వేలాది మంది ప్రాణా లు కోల్పోయారు. ఈ ఉప్పెన..  అంతర్జాతీయ దాతల దృష్టిని సైతం ఆకర్షించిందని నివేదిక వెల్లడించింది. 1979, 1990, 1996 తుపానులు కూడా ఇలాంటివేనని.. అవన్నీ మరిచిపోయే తుపానులు కాదని జాతీయ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ పేర్కొంది.

Palmyra Atoll: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి ఇదే.. కానీ ఇక్కడ ఒక్కరు కూడా..

Published date : 20 Sep 2024 09:59AM

Photo Stories