Shocking News for META Employees : ఉద్యోగులకు షాక్.. త్వరలోనే భారీగా తొలగింపు.. కారణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేషన్: మెటా సంస్థల్లోని ఉద్యోగులు తేరుకోలేని షాక్ విననున్నారు. ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్ తక్కువ పనితీరును ప్రదర్శిస్తున్న 3600 మందికి ఉద్వాసన పలకనున్నట్టు ఇటీవలె ప్రకటించారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగానే వాని భవిష్యత్ ఉంటుందని గతంలో ఆయన పలుమార్లు హెచ్చరించారు. ఆ క్రమంలోనే ఇపుడు తక్కువ పనితీరు చూపిన వారిని గుర్తించి తొలగించనున్నారు సీఈఓ జుకర్‌బర్గ్.
UGC NET 2025 : యూజీసీ పరీక్ష రీ షెడ్యూల్.. ఈ తేదీల్లోనే!!
ఈ క్రమలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు మాతృసంస్థగా ఉన్న మెటాలో సుమారు 3,600 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఆయన సిద్ధమయ్యారని తెలుస్తోంది. తొలగించిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే, మెటాలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిపై వేటు పడనుంది.
ఏడాది కాలంలో..
'కంపెనీ సాధారణంగా ఏడాది కాలంలో తక్కువ పనితీరు కనబరిచేవారిని ట్రాక్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నాం. ఇప్పటికే 2024లో పనితీరు సరిగాలేని దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాం. ఈసారి మరో 5 శాతం మందిని ఉద్యోగులను తొలగించనున్నాం. ఇది భవిష్యత్తులో 10 శాతానికి చేరుతుంది' అని మెమోలో పేర్కొన్నారు.
బలమైన ప్రతిభ..
సెప్టెంబర్ 2024 నాటికి మెటాలో దాదాపు 72,400 మంది పనిచేస్తున్నారు. తక్కువ సామర్థ్యం కలిగిన వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోబోతున్నట్టు మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా వెల్లడించారు. కంపెనీలో పనితీరు ఆధారిత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. కంపెనీ 'బలమైన ప్రతిభ' కలిగి ఉందని చెప్పడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. కొత్త వ్యక్తులను తీసుకొస్తామని చెప్పారు. ప్రదర్శన ఆధారిత కోతలు అమెరికా కంపెనీల్లో సర్వసాధారణమే. మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. తమ మొత్తం వర్క్ ఫోర్స్‌లలో ఒక శాతం కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు గతవారం ప్రకటించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- meta employees
- Exhalation of employees
- layoffs in meta
- Meta CEO Mark Zuckerberg
- yearly layoffs
- 2024 layoffs in meta
- facebook and instagram
- parent company
- parent companies of meta
- meta company layoffs 2025
- shocking news for meta employees
- Underperformers
- layoffs at meta 2025
- Underperformers in META
- Education News
- Sakshi Education News