Intercontinental Ballistic Missile: ఖండాంతర క్షిపణి ఏమిటో తెలుసా..?
ఈ సందర్భంగా సుదూరంలోనే శత్రుస్థావరాలను తుదముట్టించేందుకు ఖండాంత క్షిపణి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. 5,500 కిలోమీటర్లకు మించి ప్రయాణించగలవు. అణు, రసాయన, జీవాయుధాలను మోసుకెళ్లగలవు. సంప్రదాయక వార్‌హెడ్‌నూ మోస్తాయి.
రష్యా వాడినట్లుగా చెబుతున్న ఆర్‌ఎస్26 రూబెజ్ క్షిపణి ఎంఐఆర్‌వీ టెక్నాలజీతో పనిచేసే ఘన ఇంధన మిస్సైల్. 2011 దీనిని అభివృద్ధిచేసి 2012లో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. అది ఆనాడు 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది.
ద్రవ ఇంధనంతో పోలిస్తే ఘన ఇంధన క్షిపణులను వాడటం చాలా తేలిక. నేలమాళిగ, మొబైల్ లాంఛర్ నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇందులోని ఇంధనం, ఆక్సిడైజర్‌లను రబ్బర్‌లాంటి దానితో కలిపి మిశ్రమంగా తయారుచేసి ఒక గట్టి పెట్టెలో అమర్చుతారు. ప్రొపెలంట్ మండగానే ఇంధన ప్రజ్వలన రెప్పపాటులో భారీగా జరిగి క్షిపణి శరవేగంగా దూసుకుపోతుంది. ఇంధ్రధనస్సులాగా అర్ధచంద్రాకృతిలో ప్రయాణిస్తుంది.
దాదాపు 4,000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వేగంగా కిందకు పడపోవడం మొదలవుతుంది. ఈ దశలో ఇది ఏకంగా ధ్వని వేగానికి పది రెట్లు వేగంగా దూసుకొస్తుంది. ఎంఐఆర్‌వీ టెక్నాలజీతో ఒకే క్షిపణిలో వేర్వేరు వార్‌హెడ్‌లను ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇవి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు.
Ballistic Missile: ఉక్రెయిన్‌పైకి ఖండాంతర క్షిపణి.. ఇదే తొలిసారి..!
వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు. ఒకేసారి ప్రయోగించిన రెండు వార్‌హెడ్‌ల మధ్య దూరం 1,500 కిలోమీటర్ల దూరం ఉన్నాసరే వాటిని క్షిపణి ఖచ్చిత దిశలో జారవిడచగలదు.
తొలుత కనిపెట్టిన అమెరికా..
ఎంఐఆర్‌వీ టెక్నాలజీని తొలుత అమెరికా అభివృద్ధిచేసింది. 1970లో ఐసీబీఎంను పరీక్షించింది. 1971లో జలాంతర్గామి వెర్షన్‌లో ఎస్‌సీబీఎంను పరీక్షించింది. ఈ సాంకేతికతను 1970 చివర్లో నాటి సోవియట్ రష్యా అభివృద్ధిచేసింది. దీని సాయంతో ఐసీబీఎం, జలాంతర్గామి వెర్షన్ ఎస్‌ఎల్‌బీఎంను రూపొందించింది.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా అమెరికా, రష్యాలు స్వల్ప, దీర్ఘ, ఖండాంతర క్షిపణులను ధ్వంసంచేశాయి. 1991 జూన్ ఒకటోతేదీలోపు మొత్తంగా 2,692 క్షిపణులను నాశనంచేశాయి. అయితే ఈ ఒప్పందం నుంచి 2019లో అమెరికా వైదొలగింది.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు